ముందే గిఫ్ట్ కొట్టేసాడు

రామ్ చరణ్ ఇప్పుడు రంగస్థలం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. మరో పక్క తన తండ్రి తో తీస్తున్న సై రా సినిమా నిర్మాణం ఇలా చాలా బిజీగా గడుపుతున్నాడు. రంగస్థలం ఆడియో మార్కెట్ లో అదరగొడుతూ సినిమా మీద మంచి హైప్ పెంచేసింది. వచ్చే శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకులముందుకు వస్తుంది. మరి రంగస్థలం తో రామ్ చరణ్ మొదటిసారి కొత్తగా ట్రై చెయ్యడం… ఆ కొత్తదనం, కొత్త లుక్ కి ప్రేక్షకులు కూడా నీరాజనాలు పట్టడంతో మెగా ఫ్యామిలీ అంత ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉంది. అందుకే మార్చ్ 27 అంటే రేపు రామ్ చరణ్ బర్త్ డే కి చరణ్ పేరెంట్స్ చిరు దంపతులు అప్పుడే చరణ్ కి ఒక అద్భుతమైన గిఫ్ట్ ప్రెజెంట్ చేసే మూమెంట్స్ ఇపుడు ఫొటోస్ రూపంలో సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

అలా గిఫ్ట్ అందుకున్న రామ్ చరణ్ కూడా తనకు మామ్ అండ్ డాడ్ అంటూ సోషల్ మీడియాలో తల్లితండ్రులకు కృతఙ్ఞతలు తెలపడం, ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా మిష్టర్ సి అడ్వాన్స్ గా సర్ప్రైజ్ గిఫ్ట్ ని చరణ్ తన తల్లితండ్రులనుండి అందుకున్నాడని పోస్ట్ చేసింది. మరి చిరంజీవి ప్రస్తుతం పుత్రాత్సోహంతో తెగ ఇదైపోతున్నాడు. అందుకే ఇలా రెండు రోజుల ముందే చరణ్ కి ఒక మంచిగిఫ్టు ప్రెజెంట్ చేసాడు. అయినా ఇలా రెండు రోజుల ముందే రామ్ చరణ్ తన తల్లితండ్రులనుండి గిఫ్ట్ అందుకున్నాడు అంటే చరణ్ పుట్టినరోజుకి చిరంజీవి సై రా షూటింగ్ లో బిజీగా వుండడమో… లేకుంటే రామ్ చరణ్ ఉపాసనతో కలిసి వెకేషన్స్ కి వెళ్లడమో జరుగుతుందేమో.. అందుకే చిరు ఇలా చరణ్ కి ముందస్తు గిఫ్ట్ ఇచ్చేసాడు.

ఇక చరణ్ పుట్టినరోజు వేడులని, రంగస్థలం విడుదల ఏర్పాట్లను ఒక రేంజ్ లో చెయ్యాలని మెగా ఫాన్స్ అప్పుడే రెడీ అవుతున్నారు.

1_Chiranjeevi-Effection-on-Ram-Charan--1521992463-1654

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*