మెగా అభిమానులకు శుభవార్త!!

‘ఖైదీ నెంబర్ 150 ‘ తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాకి సురేంద్ర రెడ్డి దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబరు 6వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అని తెలిసింది. అయితే మొదటి షెడ్యూల్ లోనే ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ చేస్తునట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

యాక్షన్ సీన్లు కంపోజింగ్….

ప్రస్తుతం ఫైట్ మాస్టర్లు… ఓపెనింగ్ షెడ్యూల్ లో కంపోజ్ చేయాల్సిన యాక్షన్ సీన్లను రూపొందించడంలో బిజీగా ఉన్నట్లు సమాచారం. మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న ఈ చిత్రంలో వేర్వేరు భాషల వాళ్ళు కూడా నటిస్తున్నారు.. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి.. కీలక పాత్రల్లో నటించబోతున్నారు. అలాగే మెయిన్ హీరోయిన్ గా నయనతార ఫైనలైజ్ కాగా మరో హీరోయిన్ గా ప్రగ్యాని తీసుకున్నారు. అలాగే మరొక హీరోయిన్ ని ఫైనల్ చెయ్యాల్సి వుంది.

హై బడ్జెట్ మూవీ….

రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లోనే అత్యంత హై బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ‘బాహుబలి’ తర్వాత మన టాలీవుడ్ లో ఇది హై బడ్జెట్ మూవీ అని కూడా చెప్పవచ్చు. ఇక ఎప్పుఎపుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ డిసెంబరు 6వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ వెళుతుండడంతో చిరంజీవి ఫాన్స్ కు ఓ శుభవార్తే అని చెప్పవచ్చు.