మెగా ఉయ్యాలవాడకు రంగం సిద్ధం!!

pawan kalyan chiranjeevi secrtes

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాతో పరిశ్రమలోనే రెండవ అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవి ఇప్పుడు తన 151వ చిత్రం కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతున్నాడు. చిరంజీవి కుమారుడు హీరోగా ధృవ చిత్రం తెరకెక్కుతున్న కాలంలోనే సురేందర్ రెడ్డి తాను తర్వాత సినిమా చిరంజీవితో ఖచ్చితంగా చేస్తాను అన్నాడు గానీ అప్పట్లో అంతా అది ప్రచారంలో భాగంగానే భావించారు తప్ప అంత సీరియస్ గా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకుడుగా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రాన్ని చేజిక్కించుకుని అందరికీ షాక్ గురిచేశాడు. అయితే తాజాగా అందిన సమాచారాన్ని బట్టి సురేందర్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది.

తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిఫ్టుకు సంబంధించిన సర్వ విషయాలను చర్చించినట్లు తెలుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్టుకు సంబంధించి దర్శకుడుగా సూరి చేసిన మార్పులు, చేర్పులు తదితర విషయాలన్నీ చిరుతో సురేందర్ రెడ్డి పంచుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే సూరి చేసిన మార్పులతో చిరు చాలా ఆనందంగా ఫీలయ్యాడని, ఇక ఎలాంటి మార్పులు కూడా చేయకుండా స్క్రిఫ్టు లాక్ చేసేసుకోమని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధానికి పదేళ్లు ముందే దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమర యోధుడు నిజమైన దార్శనికుడు, రియల్ హీరో జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతుంది ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం.

అయితే ఈ సందర్భంగా సురేందర్ రెడ్డితో చిరు ఇక స్క్రిఫ్టు ఫైనల్ కావడంతో చిత్రయూనిట్ అంతా ఫ్రీ ప్రొడక్షన్ పనులు చూడమని కోరినట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికే క్యాస్టింగ్ విషయంలో సురేందర్ రెడ్డి కొన్న నిర్ణయాలు తీసేసుకున్నట్లుగా కూడా సమాచారం. ఈ చిత్రానికి గానూ ఆయా పాత్రలకు సంబంధించి తాను అనుకున్న నటులను గురించి హీరో చిరంజీవితోనూ, నిర్మాత రామ్ చరణ్ తోనూ కలిసి చర్చించనున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*