మెగా మేనల్లుడి కోసం తగ్గిన మెగా వారసుడు

మెగా హీరోలలో ఇద్దరి చిత్రాలు ఒకే రోజు విడుదల అవ్వటం అంటే ఒక పక్కన మెగా అభిమానులకి పండుగ వాతావరణం తోపాటు ముందుగా ఎవరి చిత్రం చూడాలా అనే మీమాంస కూడా ఉంటుంది. కొద్ది రోజులుగా ఈ పరిస్థితికి దారి తీస్తూ సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటెలిజెంట్ మరియు వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ చిత్రాలు ఒకే రోజున విడుదల కానున్నట్టు సంబంధిత నిర్మాణ సంస్థలు ప్రకటించాయి.

ఒక్క రోజువాయిదా….

ఈ రెండు చిత్రాలలో మెగా అభిమానులు కోరుకునే మాస్ అంశాలు వున్న చిత్రం ఇంటెలిజెంట్ కాబట్టి ఆ చిత్రానికే అధిక ఓపెనింగ్స్ వచ్చే అవకాశం మెండుగా వుంది. కాబట్టి నష్టపోయేది తొలి ప్రేమ చిత్రమే.ఈ లెక్క అర్ధం చేసుకున్నారో ఏమో కానీ నిర్మాత భోగవల్లి ప్రసాద్ తో పాటు చిత్రాన్ని అవుట్ రేట్ కి కొనుగోలు చేసిన దిల్ రాజు కూడా తొలి ప్రేమ చిత్రాన్ని ఒక్క రోజు వాయిదా వేస్తూ ఫిబ్రవరి 10 న విడుదల చేయటానికి నిశ్చయించుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1