మెగా స్టార్, సూపర్ స్టార్ హాట్స్ ఆఫ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సొంత భవనం ఉండాలని ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా పలువురు స్టార్లు.. సెలబ్రిటీలను కలిసి కొన్ని కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా నిధులు సేకరించాలని నిర్ణయించారు మా అధ్యక్షుడు శివాజీరాజా.

మొదట మెగా స్టార్ చిరంజీవి గారిని కలిసి ఈ విషయం గురించి చెప్పగా.. ప్రస్తుతం తానూ సైరా షూటింగ్ లో బిజీగా వున్నానని ఎదో ఒక్క ఈవెంట్ కు మాత్రమే వస్తానని చెప్పారట. ఆ తర్వాత రెండు నిముషాలు ఆలోచినుకుని..ఓ నాలుగు రోజుల గ్యాప్ లో మళ్లీ వస్తానని చెప్పారట చిరంజీవి. అయన మంచితనానికి నేను ఫిదా అయ్యిపోయానని చెప్పారు శివాజీ.

అలానే సూపర్ స్టార్ మహేష్ కూడా ఏ ఈవెంట్ కైనా రావడానికి నేను రెడీ అని చెప్పారంట. స్వయంగా తానే ఫోన్ చేసి మరి ఏ రకంగా ఈ కార్యక్రమాలకు సపోర్ట్ చేయగలనని ఎంక్వైరీ చేశాడట. వీరిద్దరి మంచితనానికి షాక్ అయ్యాను అని చెబుతున్నారు శివాజీ రాజా. సినిమా రంగానికి తమ శాయశక్తులా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉన్న మెగాస్టార్.. సూపర్ స్టార్ మంచితనానికి అందరూ తెగ ప్రశంసలు కురిపించేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1