మెరిసిపోతున్న హీరోయిన్!!

దేశముదురుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆమెని టాప్ హీరోయిన్ ని చేయలేకపోయాయి. ఏదో ఒకటి అరా తెలుగు సినిమాల్లో నటిస్తున్న హన్సిక కు స్టార్ డమ్ వచ్చింది మాత్రం కోలీవుడ్లోనే. అక్కడ తమిళులకు హన్సిక ఎంతో క్రేజ్. లేత బుగ్గల హన్సికకు అక్కడ తమిళులు గుడి కట్టేసి ఆరాధించేసేసారు కూడా. అయితే హన్సిక తమిళంలో హీరో శింబు తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. కానీ ఆ ప్రేమ పెళ్లివరకు వెళ్ళకుండానే బ్రేకప్ అయ్యింది.

అయితే సినిమాల్లో మాత్రం వచ్చిన ఛాన్స్ వదలకుండా పట్టుకుంటున్న హన్సిక ఇప్పుడు తెలుగులో గోపీచంద్ సరసన గౌతమ్ నందాలో నటిస్తుంది. అయితే సినిమాలో హన్సిక అందాల ఆరబోత మాములుగా లేదు. డైరెక్టర్ సంపత్ నంది తన సినిమాల్లో హీరోయిన్స్ ని చాలా హాట్ గా అలాగే గ్లామర్ గా చూపించడంలో దిట్ట. బెంగాల్ టైగర్ లో తమన్నాని, రాశి ఖన్నాని ఏ లెవల్లో చూపించాడో తెలిసిందే. అలాగే రామ్ చరణ్ రచ్చలో కూడా తమన్నా అందాలను ఎంతో బాగా చూపెట్టిన సంపత్ ఇప్పుడు గౌతమ్ నందా లో హన్సికని సినిమా మొత్తం ట్రెడిషనల్ గా చూపిస్తూనే పాటల్లో మాత్రం గ్లామర్ గా చూపిస్తున్నాడు.

గోపీచంద్ తో హన్సిక పాడే డ్యూయెట్ సాంగ్ లో హన్సిక అందాల మోత మాములుగా లేదు. గోల్డెన్ డ్రెస్ తో కుర్రకారు మతులు పోగొడుతుంది. వానలో చిత్రీకరించిన ఈ పాటలో హన్సిక పరువాలు మెరిసిపోతున్నాయి. హన్సికని సంపత్ మాత్రం చాలా అందంగా… ఆకట్టుకునే లా చూపించాడనే విషయం హన్సిక ఫోటో చూస్తే తెలుస్తుంది. మరి మీరు ఒకసారి హన్సిక అందాన్ని చూడాలంటె ఖచ్చితంగా ఈ పై పిక్ ని చూడాల్సిందే.

Hansika-in-Gautham-Nanda-Movie-1500274335-160

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1