మొన్న తల్లితో.. నిన్న తండ్రితో.

కాటమరాయుడు సినిమా తో తెరమరుగైన శృతి హాసన్.. తండ్రి తో కలిసి శెభాష్ నాయుడిలో నటిస్తుంది. కానీ ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ క్లారిటీ లేదు. ఇక శృతి హాసన్ సినిమాలకు బై బై చెప్పేసి పెళ్లి చేసుకుంటుందనే టాక్ బయలు దేరింది. అందరూ అనుకున్నట్టుగానే.. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో అందరి దృష్టి శృతి హాసన్ మీద పడింది. చేతిలో సినిమాలు లేకపోయినా బాయ్ ఫ్రెండ్ తో షికార్లు కొడుతున్న శృతి హాసన్ పై మీడియా ఫోకస్ పెట్టింది.

ఇక మొన్న‌టికి మొన్న శృతి హాసన్ అమ్మ సారిక‌,బాయ్‌ఫ్రెండ్ మైకేల్‌తో క‌లిసి రెస్టారెంట్ ద‌గ్గ‌ర క‌న‌ప‌డింది. ఇక ఆ లంచ్ మీటింగ్ లో తల్లి సారికకు తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సెల్ ని పరిచయం చెయ్యడం… పెళ్లి చేసుకుంటానని తల్లి సారికకు చెప్పడం.. ఈ పెళ్ళికి శృతి తల్లి ఒప్పుకోవడం జరిగినట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా శృతి హాసన్, మైఖేల్ కోర్సెల్ కలిసి చెన్నైలో జరిగిన నటుడు అధవ్, వినోదిని పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకు పంచెకట్టులో హాజరైన మైఖేల్…. శృతి తండ్రి కమల్ హాసన్‌తో కలిసి కనిపించాడు. కమల్ హాసన్, మైఖేల్ లు పంచె కట్టుతో అదరగొట్టారు.

మైఖేల్ కోర్సల్ కొన్ని రోజులుగా తన ప్రియురాలు శృతి హాసన్ తో కలిసి ఇండియాలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఏకంగా తమిళ సాంప్రదాయ దుస్తుల్లో శృతి హాసన్, కమల్ హాసన్తో కలిసి పెళ్లి వేడుకకు హాజరు కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తొందరలోనే కమల్ హాసన్ ఇంట శృతి హాసన్ పెళ్లి వేడుకలు ప్రారంభమవుతాయని దాదాపు అందరూ ఫిక్స్ అవుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*