రంగస్థలం ని తొక్కేసే ప్లానా?

గతంలో రెండు సినిమాలు డిజాస్టర్స్ అయిన, మహేష్ బాబు ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ తో హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమా కేవలం సూపర్ హిట్ అనే టాక్ వుంది కానీ… బ్లాక్ బస్టర్ హిట్ అన్నంత లేదంటున్నారు కొందరు. ‘భరత్ అనే నేను’ నాన్ బాహుబలి రికార్డులను కొట్టేస్తుందని దండోరా వెయ్యడమనేది కరెక్ట్ కాదేమో అంటున్నారు. రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాకి హిట్ టాక్ రావడమేకాదు… ఆ సినిమాకి చాలామంది రిపీటెడ్ ఆడియన్స్ ఉండడం… మౌత్ టాక్ బలంగా ఉండడంతో మంచి కలెక్షన్స్ సాధించిందని.. కానీ భరత్ అనే నేనులో కామెడీకి గాని, రొమాన్స్ కి గాని తగు పాళ్లల్లో ఇంపార్టెన్స్ ఇవ్వలేదని.. అయినా మహేష్ బాబుతో వన్ మ్యాన్ షోలా కొరటాల శివ సినిమాని నడిపించాడని… అయితే హిట్ అవ్వొచ్చుగాని… మరి రెండ్రోజులకే 100 కోట్ల గ్రాస్ సాధించినది అని చెప్పడం హాస్యాస్పదం అవుతుందేమో అంటున్నారు.

అసలు ‘రంగస్థలం’ సినిమా మూడున్నర రోజుల్లో సాధించిన వసూళ్లను ‘భరత్ అనే నేను’ రెండు రోజుల్లోనే వసూలు చేయడం విశేషం అని చెప్పడమే కాదు… ఈ సినిమా కేవలం రెండే రెండు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధించిందని వదిలిన పోస్టర్ అంతా హైప్ అంటున్నారు. ఇకపోతే మూడు రోజుల్లో భరత్ 125 కోట్ల గ్రాస్ ని సాధించి 75 కోట్ల షేర్ ని కొల్లగొడుతుందని.. అలాగే ఫైనల్ కలెక్షన్స్ ముగిసే సరికి 200 కోట్ల మార్క్ ని భరత్ చేరుకోనుందనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్న తరుణంలో… ‘రంగస్థలం’ కలెక్షన్స్ తొక్కేసే ప్లాన్ లోభాగంగానే ఈ భరత్ కలెక్షన్స్ ని హైప్ చేస్తున్నారనే సందేహాలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వ్యక్తమవుతున్నాయి.

అసలు మహేష్ భరత్ కి బిసి సెంటర్స్ లో పెద్దగా క్రేజ్ కనబడటం లేదు. కానీ మల్టిప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రం భరత్ నచ్చేసాడు. మరి బిసి సెంటర్స్ వాళ్ళకి సినిమా బాగా ఎక్కితే ఆ విధంగా రిపీట్ ఆడియన్స్ పెరుగుతారు. కానీ మల్టిప్లెక్స్ వాళ్ళకి సినిమా నచ్చినా మళ్ళీ మళ్ళీ చూసే సీన్ ఉండదు. అలాంటిది కేవలం ఏ సెంటర్ ఆడియన్స్ తోనే మహేష్ ఇన్ని కోట్లు కొల్లగొడతాడా అని కూడా అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు కొందరు. చూద్దాం ఈ వీక్ భరత్ కలెక్షన్స్ ఎలా వుంటాయో అనేది. అప్పుడు చెబుదాం… ఏ కలెక్షన్స్ ఫెక్ అనేది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*