రంగస్థలం ప్రమోషన్స్ కు సమంత హ్యాండ్ ఇచ్చిందా??

ఇవాళ్టి రోజుల్లో సినిమాకు ప్రమోషన్స్ చాలా అవసరం. యావరేజ్ గా ఉన్న సినిమా ప్రొమోషన్స్ ద్వారా హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రీ రిలీజ్ మాత్రమే కాదు.. పోస్ట్ రిలీజ్ కూడా ప్రమోషన్స్ ను బాగా యాక్టివ్ గా చేస్తున్నారు. ఇక వచ్చే వారంలో రిలీజ్ అవుతున్న ‘రంగస్థలం’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

యాక్టివ్ గానే ఉంది…..

ప్రమోషన్స్ విషయంలో ‘రంగస్థలం’ మూవీ టీం యాక్టీవ్ గానే ఉంది. కానీ హీరోయిన్ సమంత మాత్రం ‘రంగస్థలం’ ప్రమోషన్స్ కి హ్యాండ్ ఇచ్చింది. మహానటి షూటింగ్ పూర్తి చేసుకుని సామ్ మియామి మ్యూజిక్ ఫెస్టివల్ కు అటెండ్ అయింది. ఆ ఫెస్టివల్ కు సంబంధించి వీడియోస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.

ప్లాన్ ప్రకారమే….

దీంతో సమంత ‘రంగస్థలం’ ప్రమోషన్స్ చేయడం అసాధ్యం అని తేలిపోయింది. కానీ సమంత హ్యాండ్ ఇవ్వలేదు. ప్లాన్డ్ ప్రకారమే సమంత మియామి మ్యూజిక్ ఫెస్టివల్ కు వెళ్ళింది. ‘రంగస్థలం’ సినిమాకు సంబంధించి ఆమె ఆల్రెడీ పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చేసింది. టీం మెంబర్స్ తో కలిసి కొన్ని.. విడిగా కొన్ని రికార్డింగ్స్ చేసిందట. ఇవన్నీ సినిమా రిలీజ్ ముందు టెలికాస్ట్ కానున్నాయి. అది మ్యాటర్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*