Sat Apr 20 2024 11:53:19 GMT+0000 (Coordinated Universal Time)
రంగస్థలం ఫస్ట్ డే షేర్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత అక్కినేని హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం 'రంగస్థలం'. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నుండే దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ ని మాస్ లుక్ లో సరికొత్తగా ప్రెజంట్ చేసిన సుకుమార్ ఈ సినిమాతో మరొకసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. భారీ అంచనాలతో రిలీజ్ అయ్యిన రంగస్థలం అదే విధంగా ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 19.71 కోట్లు కలెక్ట్ చేసింది. తెలంగాణ.. ఆంధ్రలో ఫస్ట్ డే ఏరియా వైజ్ షేర్స్ మీకోసం..
ఏరియా షేర్ (కోట్లు)
------------------- --------------
నిజాం 4.43
సీడెడ్ 3.75
నెల్లూరు 0.75
కృష్ణ 1.55
గుంటూరు 3.15
వైజాగ్ 2.43
ఈస్ట్ గోదావరి 2.05
వెస్ట్ గోదావరి 1.60
AP & TS షేర్ 19.71
Next Story