రంగస్థలం యూఎస్ టాక్!!

రామ్ చరణ్ – సుకుమార్ – సమంత కాంబోలో మొదటివారి తెరెక్కిన రంగస్థలం సినిమా ఈరోజు శుక్రవారం ప్రేక్షకులముందుకు వస్తుంది. అయితే ఇండియాలో ఈరోజు విడుదలవుతున్న ఈ సినిమా యూఎస్ లో గురువారం రాత్రే రంగస్థలం సందడి థియేటర్స్ లో షురూ అయ్యింది. ఓవర్సీస్ లో రంగస్థలం టాక్ మాములుగా లేదు. రంగస్థలం అనే పల్లెటూర్లో రెండేళ్లపాటు సాగిన కథ సుకుమార్ ఎంతో అందంగా తెరకేక్కిన్చాడని.. చిట్టిబాబు గా రామ్ చరణ్ అదరగొట్టేసాడని… ఇక రామలక్ష్మి పాత్రలో సమంత అయితే సూపర్ క్యూట్ అంటున్నారు. హాట్ యాంకర్ అనసూయ అయితే రంగమ్మత్త పాత్రను పండించినదని చెబుతున్నారు వారు.

రామ్ చరణ్ చిట్టిబాబుగా సైకిల్ మీద ఎంట్రీ ఇస్తున్న సీన్ తోనే రంగస్థలం సినిమా మొదలవుతుందని.. ఈ ఎంట్రీలో రామ్ చరణ్ అదరగొట్టేసాడంటున్నారు. అలాగే దర్శకుడు సినిమాలోని పాత్రలను లయబద్దంగా పరిచయం చెయ్యడం దగ్గర్నుండి ఆ పాత్రల స్వభావాలు ను అర్ధమయ్యేలా చెప్పడానికి ఆట్టే టైం వెస్ట్ చెయ్యలేదని… అలాగే సినిమాలో సందర్భానుచితంగా వచ్చే పాటలు మాత్రం విపరీతంగా ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఇక రామ్ చరణ్ అత్తగా అనసూయ రంగమ్మ పాత్రలో అదరగొట్టేయ్యగా, జగపతి బాబు సైలెంట్ కిల్లర్ గా భయంకరమైన విలన్ గా ఆకట్టుకున్నాడట. ఇక చిట్టిబాబు అన్న కుమార్ బాబు ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు పాలిటిక్స్ లోకి దిగడం అనేది హైలెట్ గా నిలుస్తుంది.

ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయాలు, కామెడీ సీన్స్, ప్రకాష్ రాజ్ పాలిటిక్స్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో హైలెట్ గా నిలిచాయని… సమంత ఎంట్రీ, సమంత సింపుల్ సిటీ కూడా హైలెట్ గా ఉన్నాయంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం సీరియస్ గా ఎన్నికలు, పగలు, చంపుకోవడాలు, అన్నదమ్ములు విడిపోవడాలు ఇలా కాస్త సీరియస్ మోడ్ లోనే ఉంటుందట. ఇక ఈ సినిమా నిడివి మరీ 2 .50 నిముషాలు ఉండడమే ఈ సినిమా కి మైనస్ అనే టాక్ మాత్రం బాగా వినబడుతుంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫి హైలెట్ అంటున్నారు.