రియల్ హీరో బాలయ్యా..పవనా?

పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. నిన్ననే ప్రపంచం వ్యాప్తంగా రిలీజ్ అయ్యి నెగెటివ్ టాక్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు అందరి ద్రుష్టి బాలయ్య ‘జై సింహ’ సినిమాపై పడింది. ఈ సినిమా రేపు విడుదల కానుంది.’ జై సింహ’కు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ప్రేక్షకులు ఈ సినిమాని హిట్ చేసేస్తారు. ఎందుకంటె ‘జై సింహ’కి పోటీగా మరో సినిమా లేదు.

వాస్తవానికి ‘జై సింహ’తో పాటు తమిళ్ హీరో సూర్య ‘గ్యాంగ్’, రాజ్ తరుణ్ నటించిన ‘రంగులరాట్నం’ 14న రిలీజ్ కానున్నాయి. అయితే ప్రధానంగా పోటీ మాత్రం ‘అజ్ఞాతవాసి’, ‘జై సింహా’ మధ్యే నడుస్తోంది. కాబట్టి సంక్రాంతి హీరో ఎవరో రేపు అంటే శుక్రవారం సాయంత్రానికల్లా తేలిపోతుంది. నిన్నటివరకు పెద్దగా బజ్ లేని ‘జై సింహ’…. ‘అజ్ఞాతవాసి’ రిలీజ్ టాక్ తో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుని బాక్సాఫీసు బరి వద్ద ‘అజ్ఞాతవాసి’ని చీల్చి చెందడానికి రెడీ అవుతుంది.

అందులో భాగంగానే ‘జై సింహ’ ప్రొమోషన్స్ ఇంకాస్త పెంచారు. స్వయంగా బాలయ్య రంగంలోకి దిగాడు. అటు సోషల్ మీడియాలో కూడా ‘జైసింహా’ను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి హీరోయిన్ నయనతార, డైరెక్టర్ కేఎస్ రవి కుమార్ ప్లస్ పాయింట్స్. సో రియల్ హీరో పవనా .. లేదా బాలయ్యా..అనేది మాత్రం మరికొన్ని గంటల్లోనే తెలియనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1