రూమర్స్ కి చెక్ పెట్టిన దర్శకుడు!!

‘రాజా ది గ్రేట్’ సినిమా మంచి సక్సెస్ రావడంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీ ఎవరితో అని ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. అయితే తన నెక్స్ట్ మూవీకి ‘ఎఫ్- 2 ‘ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఈమధ్య వార్తలు వచ్చాయి.

ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు…

అనిల్ తీయబోయే సినిమాకు వెంకటేష్ మరియు సాయి ధరమ్ తేజ్ ఫైనలైజ్ అయ్యారు అని.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అనిల్ ని ఇబ్బంది పెట్టాయి. అయితే అనిల్ ఇప్పుడా రూమర్స్ కి చెక్ పెట్టాడు. అనిల్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. నా తర్వాత సినిమాకు ఇంకా ఎవరిని అనుకోలేదు అని… ఏమైనా అనుకుంటే తానే స్వయంగా చెబుతాని అని చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాలో మాత్రం….

అయితే సోషల్ మీడియాలో మాత్రం వెంకటేష్ ఫైనల్ అయ్యాడని… అలాగే వెంకీతో పాటే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడంటూ తెగ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అవి ఏమి నిజం కావని తెలిసిన.. వెంకీ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే అనిల్.. తాను చేసే సినిమా మాత్రం దిల్ రాజు బ్యానర్ పైనే ఉంటుందని…. ‘ఎఫ్-2 ‘ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని స్పష్టంచేశాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1