రెండు సినిమాలకే అంత…..

‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ‘ద్వారక’తో బోర్లా పడ్డాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ అనే సినిమాలో నటించాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చే శుక్రవారమే విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రంలో లిప్ లాక్ లు, బూతులు ఎక్కువ ఉన్నాయనే కారణంతో సెన్సార్ బోర్డు వాళ్ళు ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చి విడుదల చేసుకోమన్నారు. మరి ఏ సర్టిఫికెట్ అంటే ఈ సినిమా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అయితే సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చినందుకు థాంక్స్ చెబుతూనే ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ మీద సెటైర్స్ వేస్తున్నాడు. ఏ సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా కొన్ని మ్యుట్స్ కూడా అడగడంతో మనోడికి బాగా కాలింది.

అందుకే నిన్న సోమవారం రాత్రి జరిగిన ‘అర్జున్ రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో సెన్సార్ వాళ్లపై సెటైర్స్ వేసాడు. ఈవెంట్ కి హాజరైన స్టూడెంట్స్ ని రెచ్చగొట్టే దోరణిలో విజయ్ మాట్లాడి ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. సెన్సార్ వాళ్ళు ఏ ఇస్తే ఇచ్చారుగాని నేను మట్లాడిన కొన్ని పాదాలను మ్యూట్ లో తీసేసారు. ఏం మాట్లాడుతున్నావ్ రా…… అని మాట్లాడే చివరి పదాన్ని వారు మ్యూట్ చేశారు. అయితే మీరు నేను మాట్లాడేటప్పుడు మ్యూట్ లో వచ్చిన పదాలను థియేటర్స్ లో ఫీల్ చెయ్యాలి అంటూ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. అసలు లావర్నయినా, చెల్లల్నయినా ఎవరైనా ఏడిపిస్తే మనం ఎలాంటి పదాలు వాడుతాం. వాటినే నేను సినిమాలో వాడని కానీ…. అవి నిత్య జీవితంలో రైట్ గాని సినిమాలో తప్పంటున్నారు.

అయినా ఈ సినిమా కథ విన్నప్పుడే నాకు తెలుసు. ఇది చిన్న పిల్లల సినిమా కాదని…. కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే అంటూ అర్థమైందని చెప్పాడు. అలాగే స్టూడెంట్స్ ని ఉద్దేశించి మీరు ఎలా ఉండాలి అంటే అలానే ఉండండి. నేను కేవలం యాక్టర్ ని మాత్రమే… మీరైతే ఇంజినీర్లు, డాక్టర్స్ అందుకే మీరు ఎవ్వరికి తలవంచి బతకాల్సిన అవసరం లేదు అంటూ మెగా స్పీచ్ ఇచ్చాడు. అయితే దేవరకొండ స్పీచ్ ని ఇప్పుడు అందరూ, ఇండస్ట్రీలోకొచ్చిన రెండు సినిమాలకే అంత గొప్పవాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1