వందకోట్ల మార్కెట్ పై సరైనోడి కన్ను !

ఇప్పుడున్న యువ హీరోల్లో అల్లు అర్జున్ కు ప్రత్యేక క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాతో ఏకంగా యాభై కోట్ల మార్కెట్ ను క్రాస్ చేసి వాహ్వా అనిపించుకున్నాడు. ఆ తరువాత చేసిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా పెద్దగ ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా సరైనోడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటివలే విడుదలై మంచి హంగామా క్రియేట్ చేయడమే కాకుండా ఈ సినిమా పై బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలు ఏరియాల నుండి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట! మరో వైపు ఈ సినిమా శాటిలైట్ హక్కులు కుడా భారీ రేటు పలుకుతున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాతో ఏకంగా వందకోట్ల మార్కెట్ ని క్రాస్ చేయాలనే కసితో ఉన్నాడు బన్నీ. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ఎ రకంగా చూసుకున్నా అరవై కోట్లవరకు రీచ్ కానున్నట్టు సమాచారం! ఆ లెక్కన చుస్తే ఈ సినిమాను భారిగా విడుదల చేసే ప్లాన్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో బాహుబలి సినిమాను పక్కన పెడితే వందకోట్ల మార్కెట్ ను దాటింది ఒక్క మహేష్ బాబే ? ఈ సినిమాతో బన్ని కూడా క్రాస్ చేస్తే నిజంగా సరైనోడే అని పిలిపించుకోవడం ఖాయం కదా ఏమంటారు !!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*