వామ్మో మరీ ఇంత స్పీడా….!!

పూరి జగన్నాధ్ – బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పైసా వసూల్’ చిత్రం విరామం లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది . ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి సారించింది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యబాబు గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ కి జోడిగా శ్రియ శరణ్, ముస్కాన్ లు నటిస్తుండగా…. కైరా దత్ ఒక గెస్ట్ రోల్ లో కనిపించనుంది.

అయితే ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 27 న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ ఈ చిత్రం అప్పుడే దాదాపు ఫినిష్ అయినట్లు వార్తలొస్తున్నాయి. పైసా వసూల్ అప్ డేట్ చూసి అప్పుడే అందరూ షాక్ అవుతున్నారు. షూటింగ్ ఇంకా చివరి దశలో ఉండగానే అప్పుడే డబ్బింగ్ పనులు మొదలైపోయాయంటున్నారు. ఈరోజు సోమవారం ఉదయం ప్రసాద్ ల్యాబ్స్ లో ‘పైసా వసూల్’ చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ మొదలుపెట్టిందని చెబుతున్నారు.

పూరి ఏ చిత్రమైనా శరవేగంగా కంప్లీట్ చేస్తాడని తెలుసుగాని…. మరి ఇంత ఫాస్ట్ గానా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక బాలకృష్ణ 101 వ చిత్రం విడుదల కాకముందే తన 102 వ చిత్రాన్ని కె ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో అప్పుడే పట్టాలెక్కించేస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1