వెంకీ రెండవ రోజు వసూళ్ళని కాపాడగలడా?

గోపాల గోపాల చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ లు వెండితెరని పంచుకుని ప్రేక్షకులని మెప్పించిన తరువాత వీరివురు కలిసి పని చేయలేదు. కానీ అజ్ఞ్యాతవాసి చిత్రం కోసం వెంకటేష్ త్రివిక్రమ్ సృష్టించిన అతిధి పాత్ర లో తళుక్కుమని తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకోనున్నారని సినిమా సెన్సార్ కార్యక్రమాలకి వెళ్లక ముందు నుంచే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రం కోసం వెంకీ ఒక్క రోజు షూటింగ్లో పాల్గొన్నారని కొందరు, లేదు పది రోజులు కాల్ షీట్స్ తో పొడిగించిన అతిధి పాత్ర పోషించారని మరి కొందరు ప్రచారం చేశారు.

సినిమా విడుదలైన రోజు మాత్రం సినిమా టైటిల్ కార్డు లో ప్రత్యేక కృతజ్ఞతలు దగ్గర తప్ప వెంకటేష్ ఊసు కనిపించలేదు. వెంకీ నటించిన సన్నివేశం సింకింగ్ మరియు డి.టి.ఎస్.మిక్సింగ్ కార్యక్రమాలు ఆలస్యం కావటంతో తొలి రోజు ప్రింట్లో జోడించడం కుదరని కారణంగా రెండవ రోజు నుంచి వెంకీ సన్నివేశాలు జోడించే అవకాశం ఉందని వినికిడి. ఇప్పటికే సినిమా రన్ టైం ఎక్కువ ఉందని సగటు ప్రేక్షకుడు పెదవి విరుస్తున్న తరుణంలో హాస్య ప్రధానంగా సాగే వెంకీ పోరాట దృశ్యంతో పాటు ఆయన నటించిన సన్నివేశం ఎక్కడ ఇరికిస్తారో చూడాలి. ఇప్పటికే రెండవ రోజు మార్కింగ్ షోస్ నుంచి డల్ అయిన రెవెన్యూస్ ని వెంకీ కాపాడగలడేమో చూద్దాం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1