శ్రీకాంత్ అడ్డాల జాక్ పాట్ కొట్టాడు!!

బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల చాలా గ్యాప్ తీసుకుని ఓ ఫ్రెష్ స్క్రిప్ట్ తో మన మందికి రాబోతున్నాడు. అది కూడా ఓ ప్రతిష్టాత్మక బ్యానర్ పై వస్తున్నాడనేది ఇప్పుడు ఫిలింనగర్ టాక్. మరి చాలా గ్యాప్ తీసుకుని వస్తున్న అడ్డాల కొత్తబంగారులోకం స్టయిల్ లో కొత్త నటీనటుల కోసం ఓ రొమాంటిక్ స్టోరీ రాసుకున్నాడు.

అల్లు అరవింద్ తోటి…

అయితే ఈ సినిమాని తన ఆస్థాన నిర్మాత దిల్ రాజు బ్యానర్ పైనే ఉంటుందని అందరు ఊహించారు. కానీ అలా జరగలేదు.. తన దగ్గర వున్న స్క్రిప్ట్ తీసుకుని అల్లు అరవింద్ కి వినిపించాడు శ్రీకాంత్ అడ్డాలా. ఆ స్టోరీ అరవింద్ కి కూడా నచ్చటంతో సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుగుతుంది. మరి అల్లు అరవింద్ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తారా అనేది ఇప్పుడు పెద్ద డౌట్. ఎందుకంటే అల్లు అరవింద్ కింద గీత ఆర్ట్స్ కాకూండా రెండు బ్యానర్లు ఉన్నాయి. అందులో ఒకటి గీతాఆర్ట్స్ -2 . మీడియం రేంజ్ బడ్జెట్ లో ఏమైనా సినిమాలుంటే ఆ బ్యానర్ కింద తీస్తున్నారు.

ఏ బ్యానర్ పైన….

రెండోవది వి-4 మూవీస్ అనే మరో బ్యానర్. ఈ బ్యానర్ యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడం కోసం పెట్టిన బ్యానర్ ఇది. లేటెస్ట్ గా వచ్చిన ‘నెక్ట్స్ నువ్వే’ అనే సినిమా కూడా ఈ బ్యానర్ లోనే తెరకెక్కింది. మరి ఈ 2 బ్యానర్లను కాకుండా ఏకంగా గీతాఆర్ట్స్ బ్యానర్ పై సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నారంటే కచ్చితంగా శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్ట్ పెద్ద హీరోకి సంబందించిందంటున్నారు. ఏదైనా ఒక ప్లాప్ డైరెక్టర్ కి గీత ఆర్ట్స్ లో పెద్ద సినిమా అంటే శ్రీకాంత్ అడ్డాలా జాక్పాట్ కొట్టినట్టే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1