సమంతా నువ్వు గ్రేటమ్మా

samantha

సమంత కి కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు ఆమె చేసే సేవలకు బోలెడంత మంచి పేరుంది. సమాజానికి సేవచేసే సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా అనేకమంది అనాధ పిల్లల్ని ఆదుకుంటుంది. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు గొప్ప మనసుతో చికిత్స చేయించే సమంత దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది… అందుకే సమంత మనసు చాలా మంచిది అంటారు అంతా. ఆ మనసు నచ్చే అక్కినేని కుర్రోడు నాగ చైతన్య సమంత ని ప్రేమించి పెళ్ళడాడు. మరి అక్కినేని కోడలిగా సమంత భార్య బాధ్యతలను , కోడలి బాధ్యతలను మోస్తూ తన కెరీర్ ని కూడా చక్కగా మలుచుకుంటుంది. సమంత గత కొంత కాలంగా తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తుంది.

కేవలం బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే కాదు ఆ చేనేత వస్త్రాలను ఎలా పబ్లిసిటీ చేసి ప్రచారం చెయ్యాలో అంత ప్రచారం చేస్తుంది. కొత్త కొత్త డిజైన్స్ తో సమంత ఆ చేనేత దుస్తులను ధరించి అందరికి రోల్ మోడల్ గా చేనేత వస్త్రాలను గొప్పగా ప్రచారం చేస్తూ వస్తుంది. ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పలు సందర్భాలలో సమంత ని మెచ్చుకుంటున్నాడు కూడా. అయితే ఇలా సమంతా తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తునందుకు గాను ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చెయ్యడం లేదట. వారినుండి నయా పైసా ఆశించకుండా ఇలా సమంత చేనేత వస్త్రాల బ్రాండ్ ని ప్రచారం చేస్తూ సిరిసిల్ల తో సహా మరిన్ని ప్రాంతాల్లో పర్యటించి చేనేత కార్మికులకు భరోసా కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది

అయితే సమంత ఇలా చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఒక్క పైసా కూడా తీసుకోని విషయాన్నీ స్వయంగా కేటీఆర్ చెప్పాడు. మరి హీరోయిన్స్ ఎవరైనా చిన్న షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తేనే లక్షల్లో దండుకోవాలని చూస్తారు. వారు ప్రతి నిమిషాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కానీ అందరిలా కాకుండా సమంతా సేవా గుణంతో ఇలా అందరికి ఆదర్శం గా నిలుస్తుంది. మరి అంత మంచి మనసు, సేవ గుణం ఉండబట్టే ఇంకా ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*