సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న దర్శకధీరుడు…!

rajamouli and boyapati for tdp ads

కొన్ని సార్లు భారీ అంచనాలు కొంపముంచుతాయి. ఏ సినిమాకు ఎప్పుడు హైప్‌ తేవాలో.. ఏ సినిమాను ఎలా బిజినెస్‌ చేయించుకోవాలో దర్శకధీరుడు రాజమౌళికి ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా ఆయన తీసిన ‘బాహుబలి-ది బిగినింగ్‌’లోని కొన్ని విశేషాలైనా అప్పుడప్పుడు బయటకు వచ్చేవి. కానీ ‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌’ విషయంలో ఏ విషయాలు బయటకు రాకుండా రాజమౌళి గట్టి జాగ్రత్తలే తీసుకుంటున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ డిసెంబర్‌లో మొదలైంది. ఇప్పటివరకు మూడు షెడ్యూల్స్‌ పూర్తి అయ్యాయి. తాజాగా రామోజీఫిలింసిటీలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసిన రాజమౌళి తన తదుపరి షెడ్యూల్‌కు కూడా హైదరాబాద్‌నే ఎంచుకున్నాడు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో చిన్న అడవి ఉంది. అక్కడ ప్రత్యేకంగా ఓ సెట్‌ వేసి అందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు జక్కన్న. ఏ సందడి లేకుండా షూటింగ్‌ శరవేగంగా జరిగిపోతోంది. ఇప్పటికే 40శాతం షూటింగ్‌ పూర్తి చేశాడు రాజమౌళి. కాగా ఫస్ట్‌పార్ట్‌ను అద్బుతమైన ట్విస్ట్‌తో ముగించిన జక్కన్న ఈ విషయాన్ని రివీల్‌ చేయడంతోపాటు దేవసేనగా పూర్తి స్థాయి పాత్ర చేస్తున్న అనుష్క సీన్స్‌పై, మరీ ముఖ్యంగా బాహుబలి-భళ్లాలదేవల మధ్య వచ్చే వార్‌ ఎపిసోడ్స్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. మొత్తానికి ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తేవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు దర్శకధీరుడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*