సై రా కోసం అతి జాగ్రత్తలు!!

చిరంజీవి 151 వ చిత్రం సై రా నరసింహారెడ్డి చిత్రం డిసెంబర్ ఆరు నుండి సెట్స్ మీదకెళుతుందనే సమాచారం వుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 150 కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఎప్పుడో మొదలైనప్పటికీ.. రెగ్యులర్ షూటింగ్ మాత్రం లేట్ అవుతూ వచ్చింది. అయితే డిసెంబర్ 6 న మొదలు పెట్టే సై రా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభోత్సవ షాట్ లో చిరుతో పాటే వందమంది విదేశీ జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొనబోతున్నారట.

డిసెంబరు ఆరు నుంచి….

డిసెంబర్ ఆరు నుండి మొదలవ్వబోయే సై రా షూటింగ్ ని గ్యాప్ లేకుండా పది రోజుల పాటు నిర్వహిస్తారట. అయితే ఆ పది రోజుల పాటు షూట్ చేసిన ఫుటేజ్ ని చిత్ర బృందం తీక్షణంగా పరిశీలించిన తర్వాతే మళ్ళీ సైరా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభిస్తారట. అయితే అలా పరిశీలించిన సై రా ఫుటేజ్ లో మెగా స్టార్ గెటప్ స్క్రీన్ మీద ఎలా వుంది… అది అన్నివిధాలా సరిపోతుందా లేదా అన్న విషయంలో కొంతమంది ఒపీనియన్ తీసుకున్నాక… ఆ ఒపీనియన్ అన్ని విధాలా సంతృప్తి పరిస్తే… సై రా షూటింగ్ కి ఆటంకం లేకుండా జరిపిస్తారు. ఒకవేళ చిరు గెటప్ లో ఏమైనా తేడాలు అనిపిస్తే అప్పటివరకు తీసిన సై రా ఫుటేజ్ ని పక్కన పడేసి చిరు గెటప్ లో మార్పులు చేర్పులు చేసి మరీ రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేస్తారని సమాచారం.

రిహార్సల్స్ షూట్…

మరి ఇదంతా చూస్తుంటే… 150 కోట్ల సినిమాకి రిహార్సల్ షూట్ గా అనిపించంలేదు. ఏదో రిహార్సల్ బాగోపోతే… అది వదిలేసి మళ్ళీ తిరిగి ఒరిజినల్ షూట్ చేసినట్లుగా సై రా సినిమా షూటింగ్ వుండబోతుందన్నమాట. ఏది ఏమైనా భారీ బడ్జెట్ చిత్రానికి ఎన్నో జాగ్రత్తలు అవసరమే. అందుకే చరణ్ ఈ సినిమా విషయంలో అస్సలు తొందర పడడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1