సై రా లో మరో గొడవ!!

మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు సైరా నరసింహారెడ్డి చేయటానికి రెడీ గా వున్నాడు. ఈ సినిమాను డైరెక్టర్ సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే సినిమా మొదలై నెలలు గడుస్తున్నా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పనులు బాగా ఆలస్యం కావడం పై చిరు కూడా అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా రైటర్స్ కు సురేందర్ రెడ్డికు మధ్యన వార్ జరుగుతుందని అందుకే సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు అని అంటున్నారు.

ఏఆర్ రహ్మాన్ కూడా….

మొదట ఈ సినిమా రైటర్స్ పరుచూరి బ్రదర్స్ కాగా.. సురేంద్ర రెడ్డికి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ పెద్దగా నచ్చకపోవడంతో మధ్యలో సాయి మాధవ్ బుర్ర తోపాటు మరో ఇద్దరి రైటర్స్ ని ఈ సినిమా స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ చేసాడు. వారి చేత సై రా కి కావాల్సిన పవర్ ఫుల్ డైలాగ్స్ రాయిస్తున్నాడు. అయితే సాయి మాధవ్ కూడా సై రా విషయంలో అలసత్వం చేస్తున్నాడని తెల్సి.. అందరూ కలిసి వారం రోజుల్లో బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వాలని ఆర్డర్ వేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఏదొక గొడవ అన్నట్టు ప్రచారం జరుగుతుంది. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ తప్పుకున్నాడు అన్నారు.. తర్వాత సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ తప్పుకుంటే ఆ ప్లేస్ లోకి రత్నవేలు వచ్చాడు. అయితే ఇప్పుడు తాజాగా రైటర్స్ గొడవ. ఇన్ని సమస్యల మధ్య సై రా నరసింహ రెడ్డి డిసెంబర్ 6 న సెట్స్ మీదకు వెళుతుందని ప్రచారం మాత్రం గట్టిగా జరుగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1