స్క్రిప్ట్ నచ్చితేనే... సినిమా
'ప్రేమమ్', 'అ.. ఆ' సినిమాల్లో చేసింది చిన్న క్యారెక్టర్స్ అయినా బాగా పేరు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు ఈ అమ్మడు చుట్టూ డైరెక్టర్స్ తిరుగుతున్నారు. యూత్ లో బాగా క్రేజ్ వున్న హీరోయిన్ కాబట్టే.. ప్రొడ్యూసర్స్ ఆమె డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈ అమ్మడు స్క్రిప్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
రీసెంట్గా రిలీజ్ అయిన 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం ఫ్లాప్ అయినా కానీ అనుపమకి మాత్రం మంచి పేరొచ్చింది. ఆమె నటనకి ప్రేక్షకులలో మంచి ఆదరణ వచ్చింది. అందుకే ఆమె తాను సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉండేలా చూసుకుంటుంది.
అయితే ఈ ముద్దు గుమ్మకు కొత్తగా ఓ సినిమా ఆఫర్ వచ్చిందంట..ఆ సినిమాలో అనుపమాది చచ్చిపోయే క్యారెక్టర్ అంట. అయితే ఆ చిత్రం చాలా పెద్ద హీరోతో పెద్ద దర్శకుడితో రూపొందుతున్నప్పటికీ ఆమె ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట. 'ఉన్నది ఒకటే జిందగీ'లో తను చేసిన పాత్ర కూడా చనిపోతుంది కనుక మళ్లీ అలాంటిది చేయనని చెప్పిందట. అయినప్పటికీ కథల ఎంపికలో జాగ్రత్తగా వుంటానే తప్ప తన లైఫ్ సెట్ అవదని భావిస్తుందంట. అందుకే ఎడా పెడా సినిమాలేవీ ఒప్పుకోకుండా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తుందట.