అతని వల్లే రంగస్థలం లేట్ అవుతుంది
ప్రకాష్ రాజ్ ఓ గొప్ప నటుడు ఈ మాట వాడకుండానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే అతను తండ్రి పాత్ర చేసినా..విల్లన్ పాత్ర చేసినా..హీరో పాత్ర చేసినా.. చాలా ఈజీగా చేస్తుంటాడు. గత కొనేళ్లనుండి ప్రకాష్ రాజ్ చేయని సినిమా లేదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్..బాలీవుడ్ లో సినిమాల మీద సినిమాలు చేసి ఫుల్ బిజీ అయిపోయాడు. కానీ కొన్ని రోజులు నుండి పరిస్థితి ఆలా లేదు. చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇలా ప్రకాష్ రాజ్ సినిమా అవకాశాలు తగ్గిపోవడమేంటీ? దానికి అతని ప్రవర్తనే కారణమని సమాచారం.
సినిమా షూటింగ్స్ కి లేట్ గా వస్తాడంట..సడన్ గా షూటింగ్ కి రాకుండా మానేస్తాడంట. అందుకే దర్శకులు అతనికి సినిమా ఛాన్సులు ఇవ్వాలంటే భయపడుతున్నారు. ఇలా చాలా వార్తలు ప్రకాష్ రాజ్ పై వస్తుంటాయి. తాజాగా రంగస్థలం సినిమా రిలీజ్ వాయిదా పడటానికి కారణం ప్రకాష్ రాజ్ కారణమని గుసగుసలాడుతున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. ప్రకాష్ రాజ్ మీద ఆది పినిశెట్టి మీద చిత్రీకరించాల్సిన సీన్లు ఉన్నాయని... అవి తీయటానికి డైరెక్టర్ సుకుమార్ ఆది పినిశెట్టి వైజాగ్ లో షూటింగ్ లో ఉంటే బతిమిలాడి హైదరాబాద్ రప్పించాడట...కానీ ప్రకాష్ రాజ్ ఆ రోజు షూటింగ్ కి చెప్పాపెట్టకుండా డుమ్మాకొట్టాడట. ఆది తిరిగి వైజాగ్ వెళ్ళిపోయాడు. దీంతో ఆ సీన్లు పెండింగ్ పడినట్టు సమాచారం.
ప్రకాష్ రాజ్ సీనియర్ నటుడే కానీ ఇలా చేస్తాడంటే నమ్మడానికి కాస్త కష్టమే. ఆయన ప్రవర్తనతో త్రివిక్రమ్..దిల్ రాజు విసిగెత్తిపోయి వున్నారు. అందుకే ప్రకాష్ రాజ్ ప్లేస్ లో వేరే వాళ్ళని రీప్లేస్ చేసుకుంటున్నారు వీరు. మరి ప్రకాష్ రాజ్ చెవిలో ఈ విషయాలు పడ్డాయో లేదో మరి.