ఇంత ఓవర్ అవసరమా?
సౌత్ లో ఇలియానా ఒక రేంజ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఇలియానా బాలీవుడ్ మీద మోజుతో అక్కడికి ఫ్లైట్ ఎక్కేసింది. ఇక బాలీవుడ్ లో కాలు పెట్టింది మొదలు అక్కడే తిష్ట వేసేద్దామని ప్లాన్స్ వేసి వేసి కుదరక అప్పుడప్పుడు సౌత్ లో కాలు పెడుతూనే వుంది. అయితే మళ్ళీ బాలీవుడ్ లో కాస్త బిజీ అవ్వగానే సౌత్ ని చిన్న చూపు చూడడం మొదలెట్టేసింది. అసలు దక్షిణాదిన నటించాలి అంటే దర్శక నిర్మాతలు చెప్పింది చెయ్యాలి అంటే... అందాల ఆరబోతకు సై అనాలి అంటూ ఆ మధ్యన రచ్చ చేసింది.
ఎయిర్ హోస్టెస్ కావాలని....
మళ్ళీ ఇప్పుడు తాజాగా తనకు పోకిరి సినిమా కన్నా ముందు అసలు మహేష్ బాబు ఎవరో కూడా తెలియదంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తుంది. మరి ఈ రకమయిన స్టేట్ మెంట్ తో ఇలియానా మరోసారి హైలెట్ అయ్యింది. ఇలియానా బాలీవుడ్ లో నటించిన బాద్షా హో సినిమా విజయోత్సాహంలో కొట్టుకుపోతున్న ఇలియానా ముంబై లో ఒక ప్రయివేట్ కార్యక్రమానికి హాజరయ్యింది. అక్కడ ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలియానా తనకి 16 ఏళ్లకే స్టార్ స్టేటస్ వచ్చేసిందని... అసలు తనకు సినిమాల్లో వచ్చి నటించాలని ఉండేది కాదని... తాను ఎప్పుడూ ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కలలు కనేదానిని అని చెప్పుకొచ్చింది.
మహేష్ అంటే ఎవరో తెలియదా?
ఇక పోకిరీకి ముందు తనకు సినిమా ఇండస్ట్రీ గురించి ఏమి తెలియదని.. అలాగే మహేష్ అంటే కూడా ఎవరో తెలియదని చెప్పి షాక్ ఇచ్చింది. మరి ఇలియానా ఇదంతా ఇందుకోసం చేస్తుంది అంటే కేవలం తనకి ఫ్రీ పబ్లిసిటీ కోసమే అంటూ కొందరు సెటైర్స్ వేస్తున్నారు. ఎందుకంటే పోకిరి సినిమాలో మహేష్ తో నటించి సూపర్ హిట్ కొట్టిన ఈ భామ కి ఆ సినిమాకన్నా ముందు మహేష్ ఎతెలియదు అంటే కాస్త కామెడీగా ఉందని... అసలు ఇలియానా కి ఇంత ఓవర్ అవసరమా అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
- Tags
- ఇలియానా