'గరుడ వేగా'ని కాపాడుతున్న సన్నీలియోన్
అసలు అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిత్రం 'గరుడ వేగా'. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో తీసి అందరి ప్రశంసలు పొందాడు. కానీ.. ఈ సినిమా అనుకున్న స్థాయిలో అయితే వసూల్ చేయలేకపోతోంది. దీంతో నిర్మాతకి నష్టాలు తప్పవని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఆ నష్టాలు నుండి నేను కాపాడుతా అని సన్నీలియోన్ ముందికి వచ్చింది.
ఏంటి? ఈ సినిమాను సన్నీ ఎలా కాపాడింది అనుకుంటున్నారా..అవును సన్నీ నిజంగానే ఈ సినిమాను కాపాడుతుంది..అలాగని ఆమె ఏమి తన ఖాతా నుండి డబ్బులు ఇవ్వట్లేదండోయ్. సన్నీలియోన్ కి దేశమంతా ఎంత క్రేజ్ ఉందొ అందరికి తెలుసు. ఆమె ఒక్క సీన్ లో యాక్ట్ చేసిన జనాలు ఆమెను చూడటానికి థియేటర్స్ ముందు క్యూ కడతారు. అదే ఫార్ములాను 'గరుడ వేగా' నిర్మాతలు అప్లై చేస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ చేసిన ఐటెం సాంగ్ ను వేరే భాషా వాళ్ళకి చూపించి ఈ సినిమా రైట్స్ అమ్మేలా చూస్తున్నారు.
బాలీవుడ్ లో సన్నీ కి ఎంత క్రేజ్ ఉందొ మనకి తెలుసు. ఇప్పుడు ఆమె నటించిన సాంగ్ మరియు పోస్టర్స్ టీవీలలో వేసి ప్రొమోషన్స్ చేస్తున్నారట. ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతే.. హిందీ డబ్బింగ్ రైట్స్ కి మంచి రేట్స్ వస్తాయి. శాటిలైట్ రైట్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశముంది. ఇలాకనుక జరిగితే 'గరుడ వేగా' నిర్మాత నష్టాల నుండి గటెక్కవచ్చు.