డబ్బు పెట్టిన అభిమానులను ఆదుకుంటాడా?
తమిళ నటుడు సూర్య కి తమిళనాడులోనే కాక ఇతర దక్షిణ రాష్ట్రాల్లోనూ మార్కెట్ వుంది. తమిళంలో కన్నా తెలుగులో అధికంగా ప్రేక్షకాదరణ పొందినా సూర్య చిత్రాలు లేకపోలేదు. తమిళ తెలుగు భాషలతో పాటు సూర్య సినిమాలు మలయాళంలోనూ విడుదల అవుతుంటాయి. గత కొంత కాలంగా సూర్య సక్సెస్ గ్రాఫ్ బాగా పడిపోయింది. సింగం చిత్రం తరువాత ఆయన నటించిన 7th సెన్స్, బ్రదర్స్ చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. తరువాత వచ్చిన సింగం 2 ఘన విజయం పొందగా ఇప్పటి వరకు సూర్య కి మరో సక్సెస్ లేకపోవటం గమనార్హం. సికిందెర్, మాస్, మేము, 24 ఇలా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు సూర్య.
వచ్చే నెల 16 న సూర్యకి బాగా అచొచ్చిన సింగం సిరీస్ లో మూడవ భాగం విడుదల కాబోతుంది. ఇప్పటికే ఎస్ 3 ప్రచార చిత్రం మాస్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటుంది. తెలుగు,తమిళ మళయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ చిత్రం. కేరళ రాష్ట్రంలో విడుదల హక్కులను సూర్య అభిమాన సంఘమే చేజిక్కించుకుంది. సోపానం ఎంటర్టైన్మెంట్స్ వారి సహకారంతో సూర్య అభిమాన సంఘం వారే ఈ చిత్ర మలయాళ విడుదల హక్కులు కొనిపెట్టుకున్నారు. వరుస వైఫల్యాలతో వివిధ ప్రాంతాల పంపిణీదారులను ఆర్ధిక నష్టాల్లో ముంచిన సూర్య ఇప్పుడు తన అభిమానులు ఐన మలయాళీ అభిమాన సంఘం వారిని ఆదుకుంటాడో లేక గత చిత్రాల్లానే నిరాశపరుస్తాడో చూడాలి.