తొలిప్రేమ తొలిరోజు ఎంత తెచ్చింది అంటే...?
వరుణ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తొలిప్రేమ నిన్న శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలిప్రేమ తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకుని వరుణ్ తేజ్ కెరీర్ లోనే నాలుగో ఓపెనింగ్ గ్రాసర్ గా నిలిచింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిప్రేమ 3 .23 కోట్ల షేర్ కొల్లగొట్టింది. గత శుక్రవారం విడుదలైన ఇంటిలిజెంట్, గాయత్రీ సినిమాల టాక్ పెద్దగా లేకపోవడంతో తొలిప్రేమ రెండో రోజు కలెక్షన్స్ పుంజుకునే అవకాశం మాత్రం పుష్కలంగా కనబడుతుంది. ఇక ఏరియాల వారీగా తొలిప్రేమ మొదటి రోజు వరల్డ్ వైడ్ షేర్
ఏరియాల వారీగా తొలిప్రేమ మొదటి రోజు కలెక్షన్స్ కోట్లలో
నైజాం: 1 .20
సీడెడ్: 0 .35
ఉత్తరాంధ్ర: 0 .45
గుంటూరు: 0 .38
తూర్పు గోదావరి: 0 .24
పశ్చిమగోదావరి: 0 .25
కృష్ణా: 0 .24
నెల్లూరు: 0 .12
మొత్తం ఏపీ మరియు టీఎస్ కలిపి: 3 .23 కోట్లు
యుఎస్ఏ: 1 .44
రెస్టాఫ్ ఇండియా: 0 .52
టోటల్ వరల్డ్ వైడ్: 5 .19 కోట్లు