థాంక్యూ వదిన!!
అక్కినేని వారసుడు చిన్నోడైన అఖిల్ అక్కినేని మొదటి చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో అందరికీ తెలిసిందే. దాంతో ఆయన తన రెండో చిత్రానికి చాలా టైమ్తీసుకున్నాడు. ఈమధ్యకాలంలో ఆయనకు తన ప్రియురాలు శ్రేయాభూపాల్‌తో నిశ్చితార్ధం కూడా జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల ఇది బ్రేకప్ అయింది. దీంతో ఈ సిసింద్రీకి సరిగా మీసాలు రాని సమయంలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. అటు కెరీర్ పరంగా, ఇటు ప్యామిలీ పరంగా కూడా ఇబ్బందులు పడుతున్నాడు. ఇక అఖిల్ హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ బేనర్లో రూపొందే అఖిల్ రెండో చిత్రం స్టోరీ, స్క్రిప్ట్ అన్నీ ఫైనలైపోయాయి. ప్రస్తుతం లోకేషన్ల వేటలో ఉన్నారు. ఈ చిత్రానికి 'జున్ను' అనే టైటిల్‌ను పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. అంటే మొదటి చిత్రం 'అఖిల్'లో తన సొంత పేరును టైటిల్‌గా చేసుకుని దెబ్బతిన్న అఖిల్ తన రెండో చిత్రంలో నిక్‌నేమ్‌తో కనిపించనున్నాడన్న మాట. ఈ చిత్రంలో అఖిల్ క్యారెక్టర్ ముద్దు పేరు జున్ను అని సమాచారం.
మరి ఈ చిత్రంలో మేఘాఆకాష్ హీరోయిన్గా ఉంటుందా? లేక మరొకరు తెరపైకి వస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇక వాస్తవానికి ఏయన్నార్ తనయునిగా నాగ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో గానీ, నాగ్ పెద్ద కుమారుడు నాగచైతన్య తెరంగేట్రం చేసే ముందుగానీ రాని హైప్ అక్కినేని అఖిల్‌కి వచ్చింది. సినిమా విడుదలకు ముందే అనేక ప్రాడక్ట్స్‌కు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికై సంచలనం క్రియేట్ చేశాడు. మహేష్‌కు ఇప్పుడు ఉన్న బ్రాండ్ అంబాసిడర్ పోటీకి అఖిల్ చేరుకున్నాడని చెప్పినా అతిశయోక్తి కాదు. ఇక మొదటి సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ అఖిల్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ సంఖ్య తాజాగా ఒక మిలియన్ మార్కును చేరుకుని అందరినీ ఆశ్యర్యపరిచింది.
ఈ సంద్భంగా అక్కినేని బుల్లోడు తన ఫాలోవర్స్‌కి థ్యాంక్స్ చెప్పాడు. మీరు నా ఫాలోవర్స్ కాదు.. నా బిలీవర్స్ అంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశాడు. వెంటనే అఖిల్‌కు కాబోయే వదిన సమంత సైతం నీకు నేను బిలీవర్ని అని రిప్లై ఇవ్వడంతో అక్కినేని అభిమానులు ఆనందపడుతున్నారు. దానికి ప్రతిగా అఖిల్ కూడా 'థాంక్యూ వదిన' అని రిప్లై ఇవ్వడంతో ఈ ఆనందం రెండింతలైంది. ఇంకా చైతు-సామ్లపెళ్లి జరగలేదు. కేవలం నిశ్చితార్ధం మాత్రమే అయింది. అయినా కూడా అఖిల్ సామ్‌ను వదినా అని పిలిచి తన ఆప్యాయతను చాటుకున్నాడు. కాగా అఖిల్ రెండో చిత్రం ఏప్రిల్3న మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.