దానికి దీనికి ఇంత పోలికా..?
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో తెరకెక్కిన 'దర్శకుడు' చిత్రం రేపు శుక్రవారమే విడుదలకు సిద్దమవుతుంది. హరి ప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ 'దర్శకుడు' చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ అన్ని తానై వ్యవహరిస్తున్నాడు అందుకే ఈ చిత్రాన్ని ప్రమోషన్ కూడా తనదైన స్టైల్ లో చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నాడు. సినిమా టీజర్ దగ్గర నుండి సినిమా ఫస్ట్ టికెట్ కోనేవరకు ఈ చిత్రానికి పబ్లిసిటీని వినూత్న రీతిలో చెప్పాడు సుకుమార్. ఒక కొత్త దర్శకుడు డైరెక్షన్ లో తన అన్న కొడుకు అశోక్ ని హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టాలని ఆత్రుతతో సుకుమార్ ఇలా 'దర్శకుడు' పబ్లిసిటీని చేపట్టాడు.
మొదటగా 'దర్శకుడు' టీజర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో విడుదల చేయించగా.... దర్శకుడు ఆడియోని రామ్ చరణ్ చేత విడుదల చేయించాడు. అలాగే దర్శకుడు సాంగ్స్ ని కూడా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సమంత, రకుల్ ప్రీత్ వంటి వారితో విడుదల చేయించిన సుకుమార్ దర్శకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం అల్లు అర్జున్ చేతుల మీదుగా జరిపించాడు. అలాగే దర్శకుడు మొదటి టికెట్ ని మెగా స్టార్ చిరంజీవికి అందించి 'దర్శకుడు' పబ్లిసిటీ స్టెంట్ కి తెర దించాడు. మరి సుకుమార్ ఇంతగా ప్రమోష చేస్తున్న 'దర్శకుడు' చిత్రం గతంలో వచ్చిన 'బసంతి'లా కొట్టుకుపోతుందా లేకపోతె హిట్టయ్యి పదికాలాలు ప్రేక్షకుల నోట్లో నానుతుందో అనేది ఇప్పుడు ఫుల్ సస్పెన్స్.
ఇంతకీ ఇక్కడ 'బసంతి' సినిమా విషయం ఎందుకు వచ్చింది అంటే బ్రహ్మనందం కొడుకు గౌతమ్ హీరోగా వచ్చిన 'బసంతి' మూవీ ని బ్రహ్మనందం కూడా ఇలాంటి ప్రమోషన్ నే చేసాడు. ఇండస్ట్రీలో తనకున్న పలుకుబడిని బాగా వాడిన బ్రహ్మనందం టాలీవుడ్ టాప్ స్టార్స్ చేత గౌతమ్ 'బసంతి' పాటలని, టీజర్ ని, ట్రైలర్ ని విడుదల చేయించాడు. ఆఖరికి మహేష్ బాబు కూడా 'బసంతి' సినిమాని ప్రమోట్ చేసాడు. కానీ బ్రహ్మనందం ఇటువంటి ఇంట్రెస్టింగ్ పబ్లిసిటీ చేసినప్పటికీ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో గౌతమ్ నటించిన 'బసంతి' కనీసం సోదిలోకి లేకుండా పోయింది.
మరి ఇప్పుడు 'దర్శకుడు'కి సుకుమార్ ఇంతటి వెరైటీ ప్రమోషన్ చేసినప్పటికీ.. ఆ సెలబ్రిటీస్ 'దర్శకుడు' గురించి ఎంత పోజిటివ్ గా మాట్లాడినప్పటికీ సినిమాలో కథ, కంటెంట్ ఉంటె మాత్రం చిత్ర విజయాన్ని ఎవరూ ఆపలేరు. కానీ అదే సినిమాలో ఎలాంటి విషయము లేకపోతె ఏ స్టార్ నటుడు దాన్ని ఏమిచెయ్యలేడు. చూద్దాం రేపటి 'దర్శకుడు' టాక్ వరకు ఓపిక ఆడితే విషయం క్లియర్ అవుతుంది.