మరీ అంత క్రేజా..!!
పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' కి సంబంధించి హ్యాపీ న్యూ ఇయర్ పోస్టర్స్ అంటూ నిన్నటినుండి ఒక్కో పోస్టర్ ని విడుదల చేస్తుంది చిత్ర యూనిట్. ఇక నిన్న సాయంత్రం విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ కాళ్ళని మాత్రమే చూపిస్తూ హైప్ క్రియేట్ చేశారు. ఇక ఆ పోస్టర్లో పవన్ ఫేస్ ని కూడా చూపిస్తే చాలా బావుండేదని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ మూడు రోజులు 'కాటమరాయుడు' పోస్టర్స్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తామని.... న్యూ ఇయర్ రోజున 'కాటమరాయుడు' టీజర్ విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక నిన్న కాళ్లతో ట్రెండ్ క్రియేట్ చేసిన పవన్ పోస్టర్ ఇప్పుడు తాజాగా ఇంతకుముందు విడుదల చేసిన పోస్టర్ లో కూడా పవన్ వెనుక భాగం లోని కాళ్ళని మాత్రమే చూపించారు. పవన్ నడుమువరకే ఉన్న భాగం తో పంచె కట్టులో పంచె పైకి ఎత్తుకుని నడుస్తూ వెళుతున్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ రోజు విడుదల చేసే పోస్టర్ లో అయినా పవన్ లుక్ ని చూసి తరించాలనుకున్న పవన్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే మిగిలింది. అయినా మరీ ఇంత సీక్రెట్ గా పవన్ లుక్ ని నెమ్మదిగా రివీల్ చేస్తున్నారెందుకో?. అలా అయితే సినిమా మీద హై ఎక్సపెక్ట్షన్స్ పెంచొచ్చని చిత్ర యూనిట్ తో పాటు డైరెక్టర్ డాలి భావిస్తున్నాడేమో? అయినా పవన్ కళ్యాణ్ చెప్పులు చూసినా పిచ్చెక్కిపోయి పండగ చేసుకునే ఫ్యాన్స్ ఉండగా ఇలాంటి పోస్టర్స్ కి వారినుండి మంచి ఆదరణే ఉంటుంది మరి. ఇక వచ్చే పోస్టర్స్ లోనైనా పవన్ ఫేసుని రివీల్ చేస్తారో? లేక మరేదైనా పార్ట్ చూపిస్తారో చూద్దాం...!