మొదటి సినిమా గుర్తులతో....?
టాలీవుడ్ లో లవ్ కం క్యుటేస్ట్ కపుల్ అంటే ప్రస్తుతం నాగ చైతన్య - సమంతే. ఎందుకంటే ప్రేమ, పెళ్లి విషయమలో ఈ జంట ఎంతగా పాపులర్ అయ్యింది అంటే..వారిద్దరిని ఎక్కడ చూసిన అబ్బ బ్యూటిఫుల్ జంట కదా అని అనకుండా ఉండలేకపోతున్నారు. ప్రేమలో ఐదేళ్లపాటు ప్రయాణం చేసిన ఈ జంట గత ఏడాది అక్టోబర్లో పెళ్లితో ఒక్కటయ్యారు. మరి పెళ్ళైతే చేసుకున్నారు కానీ ఈ జంట కున్న బిజీ షెడ్యూల్స్ వల్ల వారిద్దరూ కలిసి పట్టుమని పదిరోజుల పాటు హానీమూన్ ఎంజాయ్ చేయలేకపోయారు. అందుకే ప్రస్తుతం తమ హాని మూన్ ని ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకుని మియామీలో చక్కర్లు కొడుతోంది.
అక్కడికి వెళ్లిన తర్వాత సమంత సినిమా రంగస్థలం ఇక్కడ విడుదలైంది. మరి ఆ సినిమాలో సమంత రామలక్ష్మిగా అద్భుతమైన నటన కనబర్చింది అంటూ అందరూ ముక్త ఖంటంతో చెబుతున్నమాట. రంగస్థలంలో రామ్ చరణ్ చిట్టిబాబుగా చెలరేగిపోయి నటిస్తే రామలక్ష్మిలా సమంత అదరగొట్టేసింది అంటున్నారు. మరి రామలక్ష్మి నటనని పొగిడినందుకు గాను సోషల్ మీడియాలో అందరికి థాంక్స్ చెబుతున్న సమంత ముందే రంగస్థలానికి సంబందించిన ప్రమోషన్స్ ని పూర్తి చేసి మరీ భర్తతో కలిసి విదేశాలకు ఎగిరిపోయింది.
పెళ్లి తర్వాత అదరగొట్టే హిట్ అందుకున్న సమంత, చైతు తో కలిసి ఆ ఆనంద క్షణాలను ఎంజాయ్ చేస్తుంది. తామెంత ఆనందంగా ఉన్నామో చెబుతూ ఎప్పటికప్పుడు చైతు - సామ్ లు కలిసున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా సామ్ పోస్ట్ చేసిన ఫొటోలో నాగ చైతన్యతో కలిసి సామ్ దిగిన ఆ ఫోటో సెంట్రల్ పార్క్ లో దిగిన ఫోటో. ఇద్దరూ కలిసి హాగ్ చేసుకున్న ఆ ఫోటో వారిద్దరి మధ్యన గాలి కూడా దూరనంత దగ్గర తనం ఉందనుకునేలా ఉందా ఫోటో. అలాగే ఆ ఫొటో కున్న మరో ప్రత్యేకత ఏమిటంటే చై, సామ్ లు లవ్ లో పడకముందు ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే పార్కులో.. ఇదే స్పాట్ లో ఏం మాయ చేశావే మూవీ షూటింగ్ లో వారిద్దరూ కలిసి పాల్గొన్నారు. మరి ప్రస్తుతం హానీమూన్ లో ఉన్న చై, సామ్ ల జంట తమ మొదటి సినిమా తీపి గుర్తులను గుర్తు చేసుకుంటూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు.
- Tags
- నాగ చైతన్య
- సమంత