రూమర్ పై క్లారిటీ ఇచ్చిన అనసూయ
లేటెస్ట్ గా వచ్చిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గురించి కాకుండా మరో పాత్ర గురించి కూడా అంత మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం లో రంగమ్మత్తగా అనసూయ అద్భుతమైన నటనను కనబరిచిన విషయం తెలిసిందే. తన పాత్రకి వచ్చిన పేరుకు అనసూయ బాగా మురిసిపోతుంది
ఈ పాత్ర చేసినందుకు చాలా గర్వంగా ఉందని చెబుతుంది. ఇక అనసూయ మరో మూవీ ‘సచ్చిందిరా గొర్రె’ విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్ తో నటించటమే కాకుండా తన తండ్రి మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కూడా ఓ కీలకపాత్రలో నటిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అయితే లేటెస్ట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో అనసూయ ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చింది. ‘‘సైరాలో నటించమని చిత్రయూనిట్ నుంచి తనని ఎవరూ కలవలేదని, ఒకవేళ నిజంగా తనని నటించమని అడిగితే మాత్రం తప్పకుండా చేస్తానని తెలిపింది. అంత గొప్ప చిత్రంలో ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా అని ఆన్సర్ ఇచ్చింది.