వరుణ్ తేజ్ తొలిప్రేమ ప్రీ రిలీజ్ లెక్కలు
ఫిదా తో ఫిదా చేసిన వరుణ్ తేజ్ ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాశి ఖన్నాతో కలిసి తొలిప్రేమ అంటూ రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డి.వి వి దానయ్య నిర్మాణంలో సినిమా తెరకెక్కినా మరో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని సొంతంగా విడుదల చేసుకుంటున్నాడు. ఫిదా సినిమా తో బోలెడు లాభాలను వెనకేసుకున్న దిల్ రాజు ఈ తొలిప్రేమ తో కూడా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా తొలిప్రేమ టైటిల్ అనౌన్సమెంట్ రాగానే ఈ సినిమాపై క్రేజ్ విపరీతంగా పెరగడమే కాదు... సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడినాయి. ఈ సినిమా టీజర్ ట్రైలర్ తో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ట్రేడ్ వర్గాల్లో. ఆ అంచనాలతోనే ఈ సినిమాకి అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా తొలిప్రేమ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా 23 కోట్ల చేసినట్లుగా సమాచారం. 23 కోట్ల షేర్ అంటే వరుణ్ తేజ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బిజినెస్ అన్నమాట. మరి తొలిప్రేమ సినిమా టాక్ యావరేజ్ గా వున్నా ఆ వసూళ్ళని ఈజీగా దాటేస్తుంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి ఏరియాల వారీగా తొలిప్రేమ ప్రి రిలీజ్ లెక్కలు కోట్లలో
నైజాం: 6 .0
సీడెడ్: 3 .0
వైజాగ్: 2 .5
గుంటూరు: 2 .0
తూర్పు గోదావరి: 1 .6
పశ్చిమ గోదావరి: 1 .4
నెల్లూరు: 0 .9
ఏపీ మరియు తెలంగాణ మొత్తం: 19 కోట్లు
ఓవర్సీస్: 3 .0
కర్ణాటక: 0 .8
రెస్టాఫ్ ఇండియా: 0.2
మొత్తం వరల్డ్ వైడ్ షేర్ 23 కోట్లు.