వింటేజ్ ఫోటో షూట్స్ తో రెచ్చగొడుతున్న రంగూన్ రనౌత్
గ్యాంగ్స్టర్, ఫాషన్ వంటి చిత్రాలలో నటించినప్పటికీ బాలీవుడ్ లో 2014 లో విడుదలైన క్వీన్ చిత్రంతో పాపులారిటీ సంపాదించుకుంది కంగనా రనౌత్. క్వీన్ విడుదల అనంతరం కంగనా రనౌత్ కనిపించిన గత చిత్రాలకు కూడా గుర్తింపు పెరిగింది. అంతలా క్వీన్ చిత్రంలో ఆకట్టుకుంది కంగనా రనౌత్. నాటి నుంచి రివాల్వర్ రాణి, క్రిష్-3 , తాను వెడ్స్ మను రిటర్న్స్ వంటి చిత్రాలతో వరుసగా ఆకట్టుకుంటుంది కంగనా. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత దేశంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న బ్రిటిష్ దొరల కుటుంబాలకు చెందిన యువతిగా కనిపించి రంగూన్ ప్రచార చిత్రంతోనే అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు కంగనా రనౌత్ అభిమానులందరూ రంగూన్ విడుదల కోసమే ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం రంగూన్ చిత్ర ప్రచారాలలో బిజీ గా గడుపుతున్న కంగనా, ఆ చిత్రంలో పోషించిన పాత్ర తరహాలోనే వింటేజ్ దుస్తులు, హెయిర్ స్టైల్ తో ఫోటో షూట్ చేసింది. బ్రిటిష్ దొరల పరిపాలన కాలంలో బ్రిటిష్ యువతుల వేషధారణ ప్రతిబింబించే విధంగా కంగనా రనౌత్ ఈ ఫోటో షూట్ లో కనిపించింది. ఈ ఫొటోస్ లో కూడా వింటేజ్ అందాలన్నీ తనలోనే ఉట్టిపడే విధంగా గ్లామర్ డోస్ ని కూడా సస్టైన్ చేసింది. రంగూన్ ప్రచార చిత్రంలో అటు సైఫ్ అలీ ఖాన్ ఇటు షాహిద్ కపూర్లతో నడిపిన రొమాన్స్ తో పాటు ఇప్పుడు తాజాగా కంగనా రనౌత్ చేసిన ఫోటో షూట్ కూడా రంగూన్ చిత్రం పై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఈ నెల 24 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం ఈ అంచనాలు ఏ మేరకు అందుకుంటుందో చూద్దాం.
- Tags
- కంగనా రనౌత్