‘2.0’ పుటేజ్ ను చూసిన డిస్ట్రిబ్యూటర్లు ఏమ్మన్నారు?

ఎన్నో సమస్యల మధ్య ఎట్టకేలకు రోబో ‘2.0’ విడుదల అవుతుంది. ఈ విషయాన్నీ లేటెస్ట్ గా డైరెక్టర్ శంకర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి అధికారంగా ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ .. ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హెవీ గ్రాఫిక్స్ ఉండటం వలన కొన్ని నెలలు నుండి విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది.

దాంతో ఈ సినిమా హక్కుల కోసం అడ్వాన్స్ చెల్లించిన డిస్ట్రిబ్యూటర్లు .. తమ డబ్బు వెనక్కి ఇచ్చేయమంటూ ఒత్తిడి చేస్తున్నారట. రిలీజ్ ఇంకా చెప్పకపోవటమే అందుకు కారణం అంట. అయితే లేటెస్ట్ సినిమా డేట్ నవంబర్ 29 అని ప్రకటించిన.. కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్.. తమ డబ్బును తిరిగి ఇచ్చేయమంటూ గొడవ చేస్తుండటంతో, వాళ్లందరినీ చెన్నై కి ఆహ్వానించి వారికి పావుగంట సేపు సినిమాను చూపించారంట.

ఈ పుటేజ్ ను చూసిన ఆ డిస్ట్రిబ్యూటర్లు ఆశ్చర్యపోయారట. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని.. మంచి వసూల్ సాధిస్తుందనే ధీమాతో ఉన్నారంట. ఆ నమ్మకంతో వారు వెనక్కి వచేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో ఈ సినిమాపై ఇంకా అంచనాలు పెట్టేసుకున్నారు ప్రేక్షకులు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*