రిలీజ్ డేట్ మాత్రమే కాదు.. టీజర్ డేట్ కూడా వచ్చేసింది!

నిన్నమొన్నటి వరకు సూపర్ స్టార్ రజినీకాంత్ – శంకర్ ల రోబో 2.ఓ సినిమా రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ లేదు. విఎఫెక్స్ పనులు డిలే అవడంతో… సినిమా విడుదల చాలా లేట్ అవుతూ వచ్చింది. ఈ ఏడాది మొదట్లో విడుదల కావాల్సిన రోబో 2.ఓ సినిమా ఈ ఏడాది చివరి నాటికి అంటే నవంబర్ 29 న విడుదలకు సిద్ధమవుతోంది. అది కూడా 2.ఓ డైరెక్టర్ శంకర్ విఎఫెక్స్ పనులు ఒక కొలిక్కి రావడంతో.. వారిచ్చిన భరోసాతో సినిమాని నవంబర్ 29 న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.

సినిమాపై పెరుగుతోన్న అంచనాలు…

మధ్యలో రోబో 2.ఓ సినిమా మేకింగ్ వీడియో, అలాగే రజని లుక్, అమీ జాక్సన్ లుక్, అలాగే విలన్ అక్షయ్ కుమార్ లుక్స్ కి భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక తాజాగా లీకైన రోబో 2.ఓ సినిమా సాంగ్ మేకింగ్ ఒకటి సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఆ లీకైన వీడియోని చూస్తుంటే… లైకా వారు ఈ సినిమాకి పెట్టిన 450 కోట్ల బడ్జెట్ కనబడుతుంది. ఇకపోతే సినిమా విడుదల తేదీ ప్రకటించినప్పటికీ.. ఇంకా విడుదల విషయంలో మీడియాలో హాట్ హాట్ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. శంకర్ 2.ఓ మీద ఉండే క్రేజ్ తగ్గుతుందని భావించి విడుదల తేదీ ఇచ్చాడు కానీ.. ఆ డేట్ కి 2.ఓ పక్కాగా వస్తుందా అనే డౌట్స్ రేజ్ చేశారు.

వినాయక చవితి సందర్భంగా టీజర్…

ఇక తాజాగా 2.ఓ టీజర్ రిలీజ్ డేట్ కూడా 2.ఓ బృందం ఒక క్లారిటీ ఇచ్చేసింది. సెప్టెంబర్ 13 న వినాయక చవితి సందర్భంగా 2 .ఓ మెరుపులు స్టార్ట్ అవుతున్నట్టుగా అధికారిక ప్రకటన ఇచ్చారు. మరి వినాయక చవితి నుండి సినిమా విడుదల వరకు 2.ఓ ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేపట్టాలని శంకర్ అండ్ టీమ్ డిసైడ్ అయ్యింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*