అనుపమకు తల్లిగా మహేష్ అమ్మ !

సీనియర్ నటి ఆమని అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆమె నటించిన ‘మిస్టర్ పెళ్లామ్’ .. ‘శుభలగ్నం’ .. ‘శుభ సంకల్పం’ .. ‘మావి చిగురు’ వంటి చిత్రాలు. ఈ సినిమాలు ఆమె అసమాన నటనకు అద్దం పడతాయి. అలాంటి ఆమని చాలా రోజులు గ్యాప్ తర్వాత మహేష్ ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ కు అమ్మగా నటించింది.

రామ్ చిత్రంలో…

అందులో మహేష్ పాత్రని లక్ష్యం దిశగా నడిపించే ఈ పాత్రలో ఆమని మరింతగా మెప్పించారు. దాంతో ఆమెకు వరస అవకాశాలు వస్తున్నాయి అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మలయాళం బ్యూటీ అనుపమకు అమ్మగా నటించడానికి ఆమె ఓకే చెప్పేసినట్టుగా సమాచారం. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో అనుపమ హీరోయిన్.
అందులో అనుపమకు తల్లి పాత్రకి ప్రాముఖ్యత ఉండటంతో ఆమనిని తీసుకున్నారట. ఆమె భర్త పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హలో గురు ప్రేమ కోసమే’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1