ప్రభాస్ ని ఇరకాటంలో పడేసిన బాలీవుడ్ హీరో..!

prabhas new look

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గత కొంతకాలం నుండి భారీ బడ్జెట్ తో `మహాభారతం 3డి` సినిమాను తెరకెక్కించాలని చాలా ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 1000 కోట్లు బడ్జెట్ తో రూపొందనుంది. దీన్ని రిలయన్స్ అంబానీతో కలిసి నిర్మించనున్నాడు అమీర్ ఖాన్. ఇది మొత్తం ఐదు భాగాలుగా తెరకెక్కించేందుకు ఏకంగా పదేళ్లు సమయం పట్టనుందని అమీర్ ఖాన్ ప్రకటించాడు. ఈ సినిమాకు ఇప్పటివరకు కాస్టింగ్ కంఫర్మ్ కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే వంటి స్టార్స్ ను సంప్రదించినట్టు సమాచారం.

అర్జునుడి పాత్రలో ప్రభాస్..?

అమీర్ ఖాన్ కృష్ణుడిగా, దీపిక పదుకొనే ద్రౌపది పాత్రలో నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. అయితే ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో అర్జునుడి పాత్ర కోసం టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అమీర్ ఖాన్ ఆల్రెడీ ప్రభాస్ ను సంప్రదించినట్టు టాక్. మరి ఆయన ఓకే చెప్పాడో లేదు ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా గత కొంతకాలం నుండి తెరకెక్కుతుందో లేదో అన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే `పద్మావతి` తెరకెక్కించేటప్పుడు భన్సాలీకి ఎదురైనా సమస్యలు ఎదురైతే ఇబ్బందని, ఎందుకు రిస్క్ అని సైలెంట్ అయినట్టు టాక్.

రెండు మూడేళ్లు ఇస్తాడా..?

కానీ అమీర్ ఖాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను తెరకెక్కించాలని చాలా ట్రై చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఆయన కాస్టింగ్ సెలక్షన్స్ లోనూ బిజీగా ఉన్నారని చెబుతున్నారు. మరి ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేస్తే దాదాపు రెండు మూడు ఏళ్లు ఈ సినిమాకు డేట్స్ ఇవ్వాలి. మరి అందుకు ప్రభాస్ రేడీనా? అన్న విషయం తెలియాలి. నో చెపుదాం అంటే అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో అడిగినప్పుడు ఆలా నో చెప్పితే కరెక్టేనా అని ప్రభాస్ ఆలోచనలో పడినట్టు టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*