`అభిమ‌న్యుడు` బ్లాక్‌బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్‌

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్స్ పై ఎమ్‌. పురుషోత్తమ్‌ సమర్పణలో యువ నిర్మాత జి. హరి నిర్మించిన ‘అభిమన్యుడు’ గతవారం విడుదలై సూపర్‌ టాక్‌తో సూపర్‌ కలెక్షన్స్‌ తో దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సెలబ్రేష‌న్స్‌ లో హీరో విశాల్‌, అర్జున్‌, పి.ఎస్‌.మిత్ర‌న్‌, శ్రీనాథ్‌, కో ప్రొడ్యూసర్స్ ప్ర‌కాశ్‌, ఎన్‌.పురుషోత్త‌మ్‌, ర‌చ‌యిత రాజేశ్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మంచి లాభాలు, పేరు వచ్చింది…

ఈ సంద‌ర్భంగా నిర్మాత జి.హ‌రి మాట్లాడుతూ – “మా అభిమ‌న్యుడు చిత్రాన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. చాలా రోజులు నుండి నిర్మాత‌గా స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్నాను. వారం రోజుల్లోనే సినిమా 12 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్‌ ను వ‌సూలు చేసింది. డ‌బ్బుల‌తో పాటు మంచి పేరు కూడా తెచ్చి పెట్టిన సినిమా ఇది. ఈ సినిమాకు నిర్మాత‌ కావ‌డం గ‌ర్వంగా ఉంది“  అన్నారు. పి.ఎస్‌.మిత్ర‌న్ మాట్లాడుతూ – “ద‌ర్శ‌కుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద విజ‌యాన్ని అందుకోవ‌డం ఇంకా ఆనందంగా ఉంది. సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు బాగా రిసీవ్ చేసుకున్నారు.“ అన్నారు.

విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది….

అర్జున్ మాట్లాడుతూ “సినిమా స‌క్సెస్ షీల్డుల‌ను మ‌రిచిపోతున్న రోజుల్లో `అభిమ‌న్యుడు`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ షీల్డ్‌ ను అందుకోవ‌డం ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూట‌ర్స్ ముఖాల్లో ఆనందం క‌న‌ప‌డుతుంది. ఈ సినిమాలో వ‌ర్క్‌ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌ కు నా అభినంద‌న‌లు. నా క్యారెక్ట‌ర్‌కి చాలా మంచి పేరు వ‌చ్చింది.  ఓ సినిమా హిట్ లేదా ప్లాప్‌కి డైరెక్ట‌రే కార‌ణం. ఈ సినిమా ఇంత పెద్ద హిట్‌ కావ‌డం వెనుక ఉన్న క్రెడిట్ మిత్ర‌న్‌కే ద‌క్కుతుంది. విశాల్ హీరోగా, ప్రొడ్యూస‌ర్‌గా ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా.. అభిమ‌న్యుడులా ఫైట్ చేసి నిజ‌మైన విక్ట‌రీ అంటే ఇదేన‌ని నిరూపించారు. ఈ సినిమాతో రియ‌ల్ లైఫ్ హీరో అని విశాల్ ప్రూవ్ చేసుకున్నాడు.“ అన్నారు. హీరో విశాల్ మాట్లాడుతూ – “త‌మిళంలో ఐదో వారం వ‌చ్చినా సినిమా హౌస్‌ఫుల్‌గానే ర‌న్ అవుతుంది. అభిమానులే కాదు, విమ‌ర్శ‌కుల నుండి కూడా సినిమాకు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల త‌ర్వాత తెలుగులో ఇంత పెద్ద హిట్ వ‌చ్చినందుకు ఆనందంగా ఉంది. నా కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.“ అన్నారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా సినిమా స‌క్సెస్ ప‌ట్ల త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*