రకుల్ పక్కా.. మరి కీర్తి?

Keerti Suresh upcoming movies

క్రిష్ – బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఎన్టీఆర్’ నందమూరి తారకరామారావు బయోపిక్. బాలకృష్ణ హీరో, నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ని దర్శకుడు క్రిష్ పరిగెత్తిస్తున్నాడు. బాలకృష్ణ 66 గెటప్స్ లో ఎన్టీఆర్ లుక్ లో కనబడనున్న ఈ సినిమాలో ఒక్కో నటులను భాగస్వామ్యం చేస్తున్నాడు క్రిష్. నిన్నగాక మొన్న చంద్రబాబు పాత్రధారి రానాతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబుని కలిసిన ఎన్టీఆర్ టీమ్ ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరులో ఎన్టీఆర్ చిన్నప్పటి జ్ఞాపకాలను తెలుసుకుని మరీ మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసాడు క్రిష్. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, నరేష్ లాంటి వారు ప్రముఖ పాత్రలు పోషిస్తుండగా రకుల్ శ్రీదేవి పాత్రలో, మహానటి కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్నారని టాక్ వినబడింది. కానీ క్రిష్ కాస్త ఆగండి నటుల ఎంపిక పూర్తయ్యాక మేమే చెబుతాం అని చెప్పడంతో.. రకుల్ శ్రీదేవి పాత్రకు కీర్తి సురేష్ సావిత్రి పాత్ర అనే న్యూస్ కి బ్రేక్ పడింది.

ఏఎన్నార్ పాత్రలో సుమంత్

తాజాగా ఏఎన్నార్ పాత్రకి అక్కినేని కూతురు కొడుకు సుమంత్ చేస్తున్నాడు. ముందుగా నాగ చైతన్య ని ఏఎన్నార్ పాత్రకి క్రిష్ సంప్రదించగా చైతు చెయ్యనని చెప్పడంతో.. చైతు ప్లేస్ లో సుమంత్ వచ్చి చేరాడు. తాజాగా శ్రీదేవి పాత్రకి రకుల్ ప్రీత్ సింగ్ సెట్ అయినట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ తో శ్రీదేవి కలిసి చేసిన చాలా సినిమాలు క్లాసికల్ హిట్స్ అయినవే. అందుకే ఎన్టీఆర్ నట జీవితంలో శ్రీదేవి కి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఎంతసేపు కనబడుతుందో క్లారిటీ లేదుగాని శ్రీదేవి పాత్రలో రకుల్ మెరవడం ఖాయం. ఇక అధికారికంగా రకుల్ సెట్ అయినా.. ఆమె డేట్స్ చూసుకుని ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో రకుల్ జాయిన్ అవుతుందని చెబుతున్నారు. మరి శ్రీదేవికి రకుల్ ఓకే అయితే.. సావిత్రి పాత్ర పరిస్థితి ఏమిటి.

కీర్తి సురేష్ ఒప్పుకుంటుందా..?

సావిత్రి పాత్రకి కీర్తి సురేష్ చేస్తుందో లేదో డౌటే. ఎందుకంటే. కీర్తి సురేష్ ప్రస్తుతానికి తెలుగు సినిమాలేమి ఒప్పుకోవడం లేదు. కేవలం తమిళ సినిమాలకే కీర్తి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. చూద్దాం సావిత్రి పాత్రకి క్రిష్ ఏ హీరోయిన్ ని తీసుకొస్తాడో అనేది. ఇకపోతే ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఈ సినిమాలో దర్శకుడు క్రిష్ కూడా ఒక నటుడిగా కనిపించనున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*