Wed Apr 24 2024 00:26:50 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీరెడ్డికి మద్దతుగా నిలిచిన నటి
టాలీవుడ్, కోలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటి శ్రీరెడ్డికి మరో నటి, సింగర్ ఆండ్రియా అండగా నిలిచింది. ‘‘ఒకవేళ శ్రీరెడ్డి మాట్లాడేది నిజమైతే, ఆ విషయాన్ని బయటపెట్టేందుకు చాలా ధైర్యం కావాలి. తనకు మాత్రం క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడూ ఎదురు కాలేదు. ఎవరైనా ఇందులో బాధితులు ఉంటే మాత్రం కచ్చితంగా ధైర్యంగా బయటకు చెప్పాలి. వేదించిన వారికి కచ్చితంగా శిక్ష పడాలి.’’ అని ఆమె స్పష్టం చేసింది.
Next Story