‘యూ టర్న్’ లో ఆది పినిశెట్టి లుక్ విడుదల..!

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘యూ టర్న్’.. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ అయ్యింది. ఓ మర్డర్ మిస్టరీని చేధించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన సమంత ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకి పవన్ కుమార్ దర్శకుడు. భూమిక చావ్లా, రాహుల్ రవీంద్రన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ పతాకాలపై శ్రీనివాస్ చిత్తూరి మరియు రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసే పని లో ఉండగా, ఆ తర్వాత పాటలను చిత్రీకరించబోతున్నారు. సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం సమకూరుస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1