డాన్సర్ మృతి.. షాకైన అజిత్

ajith in police role

అజిత్ – శివ కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న విశ్వాసం మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. శివ దర్శకత్వంలో అజిత్ నటించిన వేదాళం, వివేగం సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. వివేగం సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ… కలెక్షన్స్ మాత్రం అదరగోట్టాయి. అందుకే ఇప్పుడు ఈ కాంబో మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న విశ్వాసం మూవీ.. పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ పూణే లో జరుగుతుంది.

అయితే ఈ పూణే షెడ్యూల్ లో అజిత్ అండ్ డాన్సర్స్ పై ఒక సాంగ్ ను చిత్రీకరణ జరుగుతుంది. ఈ పాట చిత్రీకరణ సమయంలో అనుకోకుండా ఒక డ్యాన్సర్ కు గుండె పోటు రావడంతో అతను అక్కడికి అక్కడే మరణించడంతో హీరో అజిత్ షాక్ అయ్యాడట. కేవలం అజితే కాకుండా సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ ఘటనపై షాకయ్యారని చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన అజిత్ ప్రైవేట్ ఫ్లైట్ ను అరేంజ్ చేసి మృతదేహాన్ని చెన్నై తరలించే ఏర్పాటు చేసాడని చెబుతున్నారు.

డాన్సర్ అకాల మరణంతో అజిత్.. అతని అంత్యక్రియలకు అయ్యే ఖర్చులతో పాటుగా ఆ డాన్సర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడమే కాకుండా 8 లక్షల ఆర్ధిక సహాయం చేస్తున్నట్లుగా ప్రకటించడం హైలెట్ అయ్యింది. అభిమానుల పై, తమతో పనిచేసే టెక్నీషియన్స్ మీద అజిత్ కున్న ప్రేమను చూసి అజిత్ అభిమానులు తమ హీరో గొప్పదనాన్ని తెగ పొగిడేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*