అఖిల్ నెక్స్ట్ సినిమా సుక్కు తోనే కానీ సుక్కు తో కాదు

doubts on sukumar movie

అక్కినేని నాగార్జున తన కొడుకు కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని అతని లాంచింగ్, స్టార్ డైరెక్టర్ వినాయక్ చేతిలో పెట్టాడు. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో… తమకు కెరీర్ బెస్ట్ చిత్రం ఇచ్చిన విక్రమ్ కుమార్ తో అఖిల్ రెండో సినిమా చేసాడు కానీ.. అది కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. ఆ తర్వాత ఎవరు అని చూస్తున్న టైములో నాగ్ కు స్టార్ డైరెక్టర్స్ గుర్తొచ్చారు. కొరటాల..సుకుమార్..త్రివిక్రమ్ ల తో అఖిల్ మూడో చిత్రం చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడు. కానీ ఆ డైరెక్టర్స్ కు ఉన్న కమిట్మెంట్స్ తో అఖిల్.. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చేసాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఎవరితో చేస్తాడు అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. ‘కుమారి 21 ఎఫ్‌’ సినిమా తీసి మంచి పేరు దక్కించుకున్న సూర్య ప్రతాప్‌తో అఖిల్‌ నాలుగవ చిత్రం చేస్తాడట. కానీ ఈ సినిమాకు స్టోరీ, మాట‌లు, స్క్రీన్ ప్లే బాధ్య‌త సుకుమార్ చూసుకుంటారు. అయితే సుకుమార్‌తో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నించిన అఖిల్‌ ఇప్పుడు ‘కుమారి’ దర్శకుడితో అడ్జస్ట్‌ అయిపోవడం అభిమానులకి మింగుడు పడడం లేదు.

అంతేకాదు ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా…ర‌త్న‌వేలు కెమెరామెన్‌గా ప‌నిచేస్తారు. కానీ హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. వాస్తవానికి ఈ స్టోరీ రాజ్ తరుణ్ చేయాలంట.. కానీ రాజ్ తరుణ్ వరస ప్లాప్స్ తో సతమతం అవ్వడంతో…ఆ ఛాన్స్ అఖిల్ కి వచ్చిందంట. అయితే రాజ్ తరుణ్ కథ వేరే అని.. అఖిల్ కు వేరే కథ అని ఫిలింనగర్ సమాచారం. వెంకీ అట్లూరితో సినిమా అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. స్టార్ డైరెక్టర్స్ తో చేయడం కన్న యంగ్ డైరెక్టర్స్ తో సినిమా చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అందుకే సూర్య ప్రతాప్‌ కు నాగ్ ఛాన్స్ ఇచ్చాడని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*