అఖిల్.. కరణ్ చేతిలో పడ్డట్లేనా..?

అక్కినేని అఖిల్ హలో సినిమా తర్వాత సుకుమార్, కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్ 3 చేస్తున్నాడనే టాక్ ఒక రేంజ్ లో నడిచింది. తర్వాత హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆది పినిశెట్టి అన్న సత్య ప్రభాస్ దర్శకత్వంలో అఖిల్ 3 అన్నారు కానీ అనుకోకుండా తొలిప్రేమతో తోలి హిట్ అందుకున్న వెంకీ అట్లూరికి అఖిల్ కనెక్ట్ అవడంతో… వారి కాంబోలో సినిమా పట్టాలెక్కింది. ప్రస్తుతం అఖిల్ వెంకీ అట్లూరి సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి టైటిల్ గా మిస్టర్ మజ్ను పరిశీలనలో ఉంది. దాదాపుగా అదే టైటిల్ ఫైనల్ అయ్యేట్టుగా కనబడుతుంది.

క్లూ ఇచ్చిన ఆది పినిశెట్టి

ఇకపోతే గతంలో అఖిల్ సినిమాకి వినబడిన సత్య ప్రభాస్ పేరు మళ్లీ ఇప్పుడు మీడియాలో బాగా వినబడుతుంది. కారణం నీవెవరో ఇంటర్వూస్ లో ఆది పినిశెట్టి క్లారిటీ లేకుండా చెప్పిన ఒక విషయం చూస్తుంటే… అఖిల్ తో సత్య ప్రభాస్ సినిమా పక్కా అనిపిస్తుంది. ఆది పినిశెట్టి తన అన్న నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ లోని ఒక యంగ్ హీరోతో చేస్తున్నాడని చెప్పడమే కాదు… ఆ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఉంటుందనే క్లూ కూడా ఇచ్చాడు. మరి సత్య ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ యంగ్ హీరో అఖిల్ తో ఉండబోతుందా?

నాగ్ అదే పని మీద ఉన్నాడా..?

ఆ సినిమాని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడా.? ఆ మేరకు నాగార్జున పావులు కడుపుతున్నాడా.? అనే అనుమానం ఆది చెప్పిన మాటలతో అందరిలో కలుగుతుంది. ఎందుకంటే నాగార్జున ప్రస్తుతం బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నాడు. ఇక అక్కడ బాలీవుడ్ లో కూర్చుని చిన్న కొడుకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్ చేసే పనిలో ఉన్నాడేమో అనే డౌట్ లో ప్రస్తుతం మీడియా ఉంది. మరి ఇంకా అఖిల్ 3 విడుదల కాకుండానే అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద సోషల్ మీడియాతో పాటు ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*