జనవరి అని చెప్పినా….ఇంకా కన్ఫ్యూజన్ లోనే…

akhl replaces nagachaitanya

అక్కినేని అఖిల్ మిస్టర్ మజ్ను సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ తన మూడో చిత్రం మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తున్నాడు. మరి మిస్టర్ మజ్ను అంటే.. లవర్ బాయ్ అనేగా. అందుకే అఖిల్ ఫస్ట్ లుక్ దగ్గరనుండి క్లాస్ లుక్ లోనే స్టైలిష్ గా దర్శనమిస్తున్నాడు. నిన్న దీవాళి రోజున వదిలిన లుక్ లోను అఖిల్ చాలా బావున్నాడు. అయితే అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. కానీ అఖిల్ హీరోయిన్ వలన ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే సవ్యసాచి ప్లాప్ తో ఉన్న నిధి అగర్వాల్ మిస్టర్ మజ్ను లో అఖిల్ సరసన కనబడుతుంది. అలాగే ఈ సినిమాకి ఇంకా పర్ఫెక్ట్ గా విడుదల డేట్ ప్రకటించలేదు. ముందు డిసెంబర్ 21 అన్నారు కానీ… అక్కినేని ఫ్యామిలీకి డిసెంబర్ సరిగ్గా కలిసి రాలేదో ఏమో డిసెంబర్ నుండి తప్పుకున్నారు.

తాజాగా జనవరిలో విడుదల అంటున్నారు కానీ… కన్ఫ్యూజన్ లోనే ఉన్నట్టుగా కనబడుతున్నారు. ఎందుకంటే వస్తే జనవరి మొదటి వారంలోనే రావాలి. లేదంటే చివరి వారం వరకు వెయిట్ చెయ్యాలి. జనవరి 10 నుండి సంక్రాతి పండగ సినిమాల హడావిడి మొదలవుతుంది. జనవరి 11 న రామ్ చరణ్ వినయ విధేయరామ, బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు తో పాటుగా రెండు భారీ తమిళ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక మూడో వారంలోను సంక్రాతి సినిమాల హవా కొనసాగుతుంది. అప్పుడుకూడా అఖిల్ ధైర్యంగా దిగలేడు. ఇక రిపబ్లిక్ డే అంటే.. అప్ప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు, మణికర్ణిక ఇలా భారీ సినిమాలున్నాయి. ఇక అఖిల్ జనవరిలో ఎప్పుడు దిగాలి అనేది క్లారిటీ లేకే ఇలా జనవరిలో థియేటర్స్ లోకొస్తున్న అంటూ చెబుతున్నాడు. మరి మేకర్స్ కూడా టోటల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టే….ఇలా జనవరి లో విడుదల అంటూ అభిమానులను, ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లో పడేశారంటున్నారు. చూద్దాం అఖిల్ జనవరిలో దిగే డేట్ ఏమిటనేది. ఎందుకంటే అఖిల్ సోలోగా వస్తేనే కాస్త క్లిక్ అవుతాడు… కాదు పోటీ అయినా పర్లేదంటే… హలో విషయంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. హలో అప్పుడు నాని ఎంసీఏ కి ఎదురెళ్లి బోర్లా పడిన సంగతి తెలిసిందే

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*