బాబు అఖిల్ ఇది నిజమేనా..?

టాలీవుడ్ లో తెరంగేట్ర మూవీ ‘అఖిల్’ తో భారీ డిజాస్టర్ అందుకున్న అక్కినేని అఖిల్ తర్వాత ‘హలో’ సినిమా తో యావరేజ్ హిట్ అందుకున్నాడు. మరి మూడో సినిమాని ‘తొలిప్రేమ’ హిట్ తో ఉన్న కుర్ర దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి మొదలు పెట్టేసాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫారిన్ లో జరుగుతుంది. కాగా అఖిల్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలోనే కాదు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైందని.. అలాగే ఈ విషయంలో అఖిల్ తండ్రి నాగార్జున బాలీవుడ్ నిర్మాతలతో చర్చలు జరిపినట్టుగా టాక్.

తండ్రితో పాటు కొడుకూ బాలీవుడ్ బాట

ప్రస్తుతం నాగార్జున తెలుగులో హీరో నాని తో పాటు దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తో ఒక మల్టీస్టారర్ సినిమా చెయ్యడమే కాదు బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మాతగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గతంలోనూ నాగార్జున అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. కానీ ఈ మధ్య కాలం అంటే ఓ పదేళ్లుగా నాగార్జున బాలీవుడ్ వైపు చూడనే లేదు. మళ్లీ ఇన్నాళ్ళకి నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర లో నటిస్తున్నాడు. ఇప్పటికే ‘బ్రహ్మాస్త్ర’ కోసం నాగ్ బల్గెరియా వెళ్ళాడు కూడా. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాలో నటిస్తున్న నాగార్జునతో కరణ్ మరో డీల్ కూడా కూర్చుకున్నాడని అంటున్నారు.

బాలీవుడ్ లోనైనా సక్సెస్ అవుతాడా..?

కరణ్ జోహార్ కి బాహుబలి సినిమా అప్పటి నుండి తెలుగు సినిమాల మీద, హీరోల మీద ఇంట్రెస్ట్ కలిగింది. అందుకే ప్రభాస్ ని బాలీవుడ్ లో ఎంట్రీ ఇప్పిద్దామనుకుంటే.. ప్రభాస్ కరణ్ ని హోల్డ్ లో పెట్టాడు. ఇక రానా అడపాదడపా బాలీవుడ్ కి వచ్చి వెళుతున్నాడు. అయితే కరణ్ జోహార్ ఇప్పుడు నాగార్జున కొడుకు అఖిల్ ని బాలీవుడ్ ఎంట్రీ ఇప్పించే ఉద్దేశ్యంతో ఉన్నాడని… అది కూడా అఖిల్ నాలుగో సినిమానే అని అంటున్నారు. మరి అఖిల్ నాలుగో సినిమాని రవి రాజా పినిశెట్టి డైరెక్షన్ లో చేయబోతున్నాడనే న్యూస్ ఉండగా.. ఆ సినిమానే కరణ జోహార్ తెలుగు, తమిళం, హిందీలో నిర్మించబోతున్నాడని అంటున్నారు. మరి తెలుగులోనే సరిగ్గా సక్సెస్ అవని అఖిల్ బాలీవుడ్ కి వెళ్ళి ఏం చేస్తాడో అని ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*