అఖిల్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా?

అఖిల్ తన మొదటి సినిమాతో ప్రేక్షకులని నిరాశపరిచాడు. రెండో సినిమాతో మాత్రం పర్లేదు అనిపించుకున్నాడు కానీ సినిమా అంతగా ఆడలేదు. ఎలాగైనా తన మూడో సినిమాతో ప్రేక్షకుల మదిలో నాటుకుపోవాలి ఫిక్స్ అయ్యాడు అఖిల్. అందుకే తన మూడో చిత్రం ‘తొలిప్రేమ’ లాంటి యూత్ ఫుల్ రొమాంటిక్ చిత్రం తీసిన వెంకీ అట్లూరితో చేస్తున్నాడు.

మూడో టైటిల్ కూడా అంతేనా…

అయితే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ఏంటో ఇంకా ఫిక్స్ కాలేదు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాకు ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారంట. వాస్తవానికి అఖిల్ గత రెండు సినిమాల టైటిల్స్ అంతగా క్యాచీగా ఏమి లేవు. రెండు టైటిల్స్ పెద్ద క్రియేటివ్ గా అనిపించలేదు.ఇప్పుడు మూడో సినిమాకి ‘మిస్టర్ మజ్ను’ అనుకుంటున్నారు కానీ ఈ టైటిల్ ఎటువంటి బజ్ ను క్రియేట్ చేసే టైటిల్ కాదు. పైగా మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కి ఈ పేరు వల్ల కొత్తగా ఏం కలిసొచ్చే అవకాశం లేదు. దీనిబట్టి మరి ఈ టైటిల్ ను ఫిక్స్ చేస్తారా అన్న అనుమానం ఉంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది. చాలావరకు సీన్స్ లండన్ లో తీయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*