అక్కినేని వారి ట్వీట్స్ చూశారు…!

అక్కినేని మనవళ్లు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మెళ్లిగా పాతుకుపోతున్నారు. నాగ చైతన్య, అఖిల్ లు స్ట్రాంగ్ గా ఉండగా.. సుమంత్, సుశాంత్ లు ఇంకా హీరోగా నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతున్నారు. తాజాగా నాగసుశీల కొడుకు సుశాంత్..రుహానీ శర్మతో కలిసి రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ‘చి.ల.సౌ’ సినిమాలో నటించాడు. ఇప్పుడా సినిమా విడుదలకాబోతుంది. ఇక ‘చి.ల.సౌ’ సినిమా పై హైప్ పెంచడానికి అక్కినేని కుటుంబం మొత్తం రంగంలోకి దిగింది. ఎలాగూ సుశాంత్ అక్కినేని మనవడు… అలాగే దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. అక్కినేని కోడలు సమంతకి ఫ్రెండ్. అందుకే ఆ ‘చి.ల.సౌ’ విడుదల బాధ్యతలను అక్కినేని కుటుంబం తలకెత్తుకుంది.

సుశాంత్ చేసిన ట్వీట్స్ తో…

ఇక ప్రమోషన్స్ లో భాగంగా అక్కినేని ఫ్యామిలి మొత్తం పార్టిసిపేట్ చేస్తుంది. తాజాగా అక్కినేని మనవళ్లు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు గాను ముందుగా సుశాంత్… హలో బాయ్స్ అండ్ గాల్స్… నా బ్యాచ్ లర్ పార్టీకి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను. కింద ఉన్న గూగుల్ లింక్ తెరచి, పెళ్లిని వాయిదా వేసుకునేందుకు మీరు ఏ కారణం చెబుతారో తెలియజేయండి. గెలుపొందిన వారికి రిలీజ్ కు ముందే సినిమాను చూపించి, అద్భుతమైన పార్టీ ఇస్తాను.. అంటూ ఒక పజిల్ తో కూడిన ట్వీట్ చేసాడు. మరి అలా సుశాంత్ ట్వీట్ చేసాడో లేదో… నాగ చైతన్య దాన్ని రీ ట్వీట్ చేస్తూ… దట్స్ క్రేజీ మ్యాన్. కేవలం బ్యాచిలర్స్ నే పిలుస్తారా… నన్ను మరచిపోయినట్టున్నావు. నాలోని బ్రహ్మచారి ఇంకా బతికే ఉన్నాడు.. అంటూ గమ్మత్తుగా కొంటెగా ట్వీట్ చేసాడు.

ఫ్యామిలీ మొత్తం దిగిపోయిందిగా…

మరి నాగ చైతన్య అంత స్టైలిష్ గా తాను ఇంకా బ్యాచిలర్ నే అంటూ ట్వీట్ చేస్తే సమంత ఊరుకుంటుందా.. అందుకే హీరోయిన్ సమంత కూడా భర్తకి భలే కౌంటర్ ఇచ్చింది. మామూలుగానే అల్లరి పిల్ల అయిన సమంత కూడా భర్త ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ.. భర్తగారూ… మీరు చెప్పింది నిజమే అంటూ ఆసక్తిగా ట్వీట్ చేసింది. మరి ఇంతమంది ట్వీట్స్ చేస్తుంటే అఖిల్ ఊరుకుంటాడా… అక్కినేని అఖిల్ కూడా తనవాళ్లకి భలే ఫన్నీగా ట్వీట్ చేసాడు. ప్రస్తుతం తన మూడో సినిమా షూటింగ్ లో విదేశాల్లో బిజీగా వున్న అఖిల్ సరదాగా.. బ్రో నేను లేకుండా పార్టీనా? అంటూ ట్వీట్ చేసాడు. మరి ఇపుడు అక్కినేని మనవళ్లు చేసిన ఈ ట్వీట్స్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*